వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. హ్యాట్రిక్ విన్స్‌తో కొనసాగుతున్న రోహిత్ సేన మరో విజయాన్ని సొంతం చేసుకొని సెమీస్ ఛాన్స్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. అయితే గత మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోరంగా ఓడిపోయిన బంగ్లాదేశ్.. ఈసారైనా పుంజుకోవాలని బలంగా కోరుకుంటోంది. కాబట్టి రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఢీ అంటే ఢీ అనేలా ఉంటుందని చెప్పొచ్చు.
ఇక, బ్యాటింగ్‌లో టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు టీమిండియా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అయితే డెంగ్యూ నుంచి కోలుకొని వచ్చిన శుబ్‌మన్ గిల్ వరల్డ్ కప్‌లో ఒక భారీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు మంచి టచ్‌లో ఉన్నారో లేదో తేలాల్సి ఉంది. బౌలింగ్‌లో భారత్‌కు వంక పెట్టడానికి లేదు. మొదట్లో కాస్త రన్స్ ఇస్తున్నప్పటికీ పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకున్నాక మన బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. స్వింగ్, స్పిన్ రాబట్టి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. భారత్-బంగ్లా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పుణె వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలుస్తోంది. దీంతో పేస్ విభాగంలో శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో మహ్మద్ షమీని తీసుకునే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక, ఈ మ్యాచ్ కోసం భారత్ ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్లు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశారు. మన బ్యాటర్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్న వీడియో తాజాగా బయటికి వచ్చింది. ఇందులో కోహ్లీ, అయ్యర్, హార్దిక్ లాంటి బ్యాటర్లు కొట్టిన షాట్స్‌కు స్టేడియంలోని ఆడియెన్స్ ఫీల్డర్లుగా మారారు. వారితో పాటు రక్షణగా ఉన్న పోలీసులు కూడా ఫీల్డింగ్ చేశారు. నెట్స్‌లో కోహ్లీ కొట్టిన ఒక షాట్ గ్రౌండ్ అవతల పడగా.. పోలీసులు ఆ బాల్‌ను పట్టుకొని తిరిగి క్రికెటర్ల వైపు విసిరారు. పోలీసు అన్నలు ఫీల్డింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి.. పోలీసుల ఫీల్డింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బంగ్లా ఫ్యాన్స్‌కు పాక్ నటి బంపరాఫర్.. భారత్‌ను ఓడిస్తే డేట్‌కు వస్తానంటూ..!