iDreamPost
android-app
ios-app

షమి బదులు శార్దూల్ ఎందుకు? కారణం ఆ గుడ్డి నమ్మకమేనా?

  • Author singhj Updated - 10:54 AM, Thu - 19 October 23
  • Author singhj Updated - 10:54 AM, Thu - 19 October 23
షమి బదులు శార్దూల్ ఎందుకు? కారణం ఆ గుడ్డి నమ్మకమేనా?

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చితక్కొడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్​తో చెలరేగిపోతున్నాడు. శుబ్​మన్ గిల్ రీసెంట్​గా జ్వరం నుంచి కోలుకొని వచ్చాడు. కొన్నాళ్లుగా అతడు మంచి ఫామ్​లోనే ఉన్నాడు. కాబట్టి అతడితో ఇబ్బంది లేదు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్​లో కేఎల్ రాహుల్ కూడా సత్తా చాటాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్​లపై రాణించాడు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్​లో పెద్దగా ఛాన్స్ రాలేదు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అతడు బంతితో ఆకట్టుకున్నాడు.

బౌలింగ్​లో పేసర్లు బుమ్రా, సిరాజ్​తో పాటు స్పిన్నర్లు కుల్​దీప్, జడేజా జోరు మీద ఉన్నారు. భారత జట్టులో మొత్తం పది స్థానాలపై ఎలాంటి ఆందోళన లేదు. కానీ మెయిన్ టీమ్​లో ఆడుతున్న వారిలో ఒక్క ఆటగాడి మీద మాత్రం టీమ్ మేనేజ్​మెంట్​కు ఉన్న నమ్మకం ఫ్యాన్స్​కు కలగట్లేదు. ఆ ప్లేయరే.. శార్దూల్ ఠాకూర్. వన్డేల్లో అతడి స్టాటిస్టిక్స్ ఆశించిన స్థాయిలో లేకున్నా.. రీసెంట్​ ఫామ్ అంతంతమాత్రంగానే ఉన్నా రెగ్యులర్​గా తుది జట్టులో ఆడుతున్నాడు శార్దూల్. కెరీర్​లో మొత్తంగా 46 వన్డేల్లో అతడు తీసింది 64 వికెట్లే. ప్రస్తుత ప్రపంచ కప్​లో 8 ఓవర్లు వేసి 43 రన్స్ ఇచ్చిన ఈ పేస్ బౌలింగ్​ ఆల్​రౌండర్ ఒక్క వికెటే తీశాడు.

లోయరార్డర్​లో బ్యాటింగ్​లో శార్దూల్ ఉపయోగపడతాడని అనుకుంటున్నా.. ఇప్పటివరకు హార్దిక్ పాండ్యాకే బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. అయినా శార్దూల్ ప్రధానంగా బౌలర్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇందులో అతడు పెద్దగా రాణిస్తున్నది లేదు. ఆల్​రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాతో ఎక్కువ ఓవర్లు వేయిస్తున్నారు. శార్దూల్​ను పెద్దగా వాడుకోవడం లేదు. దీనికో కారణం ఉంది. టీమ్​కు అవసరమైనప్పుడల్లా పాండ్యా వికెట్ తీస్తుండటమే. పాండ్యాకు బౌలింగ్​ ఇచ్చి.. శార్దూల్​ను దూరం పెడుతున్నారంటే అతడిపై కెప్టెన్​కు అంత నమ్మకం లేదేమోనని అనిపిస్తోందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అదే టైమ్​లో ధారాళంగా రన్స్ ఇచ్చేస్తాడనే పేరు కూడా శార్దూల్​కు ఉండనే ఉంది.

ఎక్కువ రన్స్ ఇస్తాడనే భయంతోనే శార్దూల్​కు కోటా పూర్తి చేసే ఛాన్స్​ను రోహిత్ ఇవ్వట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. పిచ్ స్పిన్​కు అనుకూలిస్తుందని తొలి వన్డేలో రవిచంద్రన్ అశ్విన్​ను ఆడించిన టీమ్ మేనేజ్​మెంట్.. తర్వాతి రెండు మ్యాచులకు అతడ్ని తప్పించి శార్దూల్​ను తీసుకుంది. గత రెండు వన్డేల్లో శార్దూల్​ ఆడటం వల్ల భారత్​కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. అహ్మదాబాద్​ వన్డేలో శార్దూల్​ ప్లేస్​లో ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న మహ్మద్ షమీని ఆడించాల్సిందనే కామెంట్స్ వినిపించాయి. ఐపీఎల్లో గుజరాత్​కు ఆడే షమీకి అహ్మదాబాద్ హోం గ్రౌండ్ లాంటిదని.. అతడు బరిలోకి దిగితే పాక్​ను మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేసేవారమని అనలిస్టులు అంటున్నారు.

వరల్డ్ కప్​కు ముందు ఆస్ట్రేలియాతో సిరీస్​లో షమి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్​లో 5 వికెట్లు తీశాడు. ఎంతో అనుభవం ఉన్న షమి మంచి వేగంతో నిలకడగా ఒకే చోట బంతులు వేయగలడు. తరచూ వికెట్లు తీసే షమీని కాకుండా శార్దూల్​ను ఆడించడానికి టీమ్ మేనేజ్​మెంట్ గుడ్డి నమ్మకమే కారణమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. నాలుగో పేసర్​ను తీసుకోవాలంటే బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉండాలనే గుడ్డి టెంప్లేట్​ను మేనేజ్​మెంట్ ఫాలో అవుతుండటమే షమీని జట్టులోకి రాకుండా ఆపుతోందని చెబుతున్నారు. తదుపరి మ్యాచుల్లో శార్దూల్​నే మళ్లీ బరిలోకి దింపుతారా లేదా షమీకి ఛాన్స్ ఇస్తారో చూడాలి. మరి.. షమీని ఆడించకుండా మేనేజ్​మెంట్ తప్పు చేస్తోందనే అభిప్రాయాలపై మీరేం  అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: పెద్ద జట్లను ముంచుతున్న చెత్త ఫార్ములా!