వన్డే వరల్డ్ కప్-2023లో మొదటి రెండు మ్యాచుల వరకు పాకిస్థాన్ జట్టు ఫేవరెట్స్‌లో ఒకటిగా కనిపించింది. వరుసగా రెండు విజయాలతో బాబర్ సేన ఫుల్ జోష్‌గా అనిపించింది. కానీ ఒకే ఒక్క మ్యాచ్ ఆ టీమ్ ప్లేయర్స్‌తో పాటు వారి ఫ్యాన్స్‌లోనూ నిరాశను కమ్మేసింది. అదే భారత్‌తో జరిగిన మ్యాచ్. ఈ ఇరు టీమ్స్ గ్రౌండ్లో తలపడుతున్నాయంటే మ్యాచ్ చాలా టఫ్‌గా ఉంటుందని అంతా అనుకుంటారు. చివరి వరకు ఉత్కంఠ పోరు ఉంటుందని, ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అని భావిస్తారు. కానీ దీనికి భిన్నంగా జరిగింది. రోహిత్ సేన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ముందు పాకిస్థాన్ నిలబడలేకపోయింది.
భారత్ చేతుల్లో చిత్తవడంతో పాక్ జట్టు నిరాశలో కూరుకుపోయింది. ఓటమి కంటే కూడా బౌలింగ్, బ్యాటింగ్‌లో దారుణంగా ఫెయిలవ్వడం ఆ టీమ్‌ను బాధిస్తోంది. పాక్ ప్లేయర్ల ఆటతీరుపై అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇలా ఆడితే ఇక వరల్డ్ కప్ వచ్చినట్లేనని ఫైర్ అవుతున్నారు. బాబర్ ఆజం కెప్టెన్సీ ఫెయిల్యూర్ వల్లే టీమ్‌కు ఓటమి ఎదురైందని విమర్శిస్తున్నారు. టీమ్ సెలక్షన్ బాగోలేదని.. వరుసగా విఫలమవుతున్నా స్పిన్నర్లు షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని సీనియర్ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.
భారత్‌పై ఓడిన పాకిస్థాన్ నెక్స్ట్ ఆస్ట్రేలియాతో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే కీలక మ్యాచ్‌కు ముందు ఆ టీమ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. బాబర్ సేనను విషజ్వరాలు బాధిస్తున్నాయి. దాయాది జట్టులో చాలా మంది జ్వరంతో బాధపడుతున్నారని.. కొంతమందికి కాస్త నయం కాగా.. ఇంకొందరు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారని పీసీబీ మీడియా మేనేజర్ అషాన్ ఇఫ్తికార్ తెలిపారు. గత మ్యాచ్‌లో టీమిండియాలో చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. అక్టోబర్ 20న ఆసీస్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్‌కు సెమీస్ కష్టాలు మరింత పెరుగుతాయి.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు బెంగళూరుకు చేరుకున్నాయి. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదీ హెల్తీగా ఉన్నారని తెలుస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు వచ్చిన కొత్త సమస్య నుంచి పాక్ ఎలా బయటపడుతుందో చూడాలి. బాబర్ సేన దుస్థితిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. పాపం పాక్‌కు ఏదీ కలసి రావడం లేదని అంటున్నారు. విషజ్వరాలు వీడకపోతే ఆ టీమ్ పనైపోయినట్లేనని చెబుతున్నారు. మరి.. భారత్‌పై ఓటమితో బాధలో ఉన్న పాక్‌కు కొత్త సమస్య రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బంగ్లాతో మ్యాచ్.. సరికొత్త ప్లాన్ చేస్తున్న రోహిత్!
Some Pakistan players are suffering from Viral fever before their clash against Australia in Bengaluru on 20th October.#CWC23 #BabarAzam #AUSvPAK #WorldCup2023 #CricketTwitter pic.twitter.com/G72epKoTDh
— InsideSport (@InsideSportIND) October 17, 2023