వన్డే వరల్డ్ కప్-2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. ఇవాళ బంగ్లాదేశ్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అయితే వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి ఈ మ్యాచ్‌లోనూ ఆడే ఛాన్స్ రాలేదు. మొదటి మూడు మ్యాచుల్లోనూ తుది జట్టులో చోటు దక్కని షమీకి బంగ్లాతో పోరులోనూ టీమ్ మేనేజ్మెంట్ మొండిచేయి చూపింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడిన జట్టునే భారత మేనేజ్మెంట్ కొనసాగించింది.
ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న మహ్మద్ షమి బ్యాటింగ్ పిచ్ మీద కూడా వికెట్లు తీస్తాడని నెట్టింట అభిమానులు కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన షమీని బెంచ్ మీద కూర్చోబెట్టడం కఠినమైన నిర్ణయమని అన్నాడు. అయితే ప్రతి మ్యాచ్‌కు ముందు ప్లేయర్స్‌తో సంప్రదింపులు జరిపే డెసిజన్స్ తీసుకుంటామని తెలిపారు. వరల్డ్ కప్ కోసం టీమ్‌ను సెలక్ట్ చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ స్పష్టమైన సమాచారం ఇచ్చామన్నాడు పరాస్ మాంబ్రే. పిచ్‌ను బట్టి ఫైనల్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకుంటామని ముందే చెప్పేశామన్నాడు.
‘కొన్నిసార్లు ప్లేయర్స్‌కు టీమ్‌లో ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచులకు దూరంగా ఉన్నాడు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వాళ్లకు క్లియర్‌గా చెప్పాం. జస్ప్రీత్ బుమ్రా టీమ్‌లో ఉండటం వల్ల బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారింది. వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్ల లిస్ట్‌లో అతడు ముందుంటాడు. మిడిల్ ఓవర్లలనూ రన్స్‌ను కంట్రోల్ చేసి వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది’ అని మాంబ్రే చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్‌లోకి ఎంట్రీ కాకముందే ప్లాన్స్ రెడీ చేసుకున్నామని తెలిపారు. ఏ టీమ్‌ను తేలిగ్గా తీసుకోమని స్పష్టం చేశారు. మరి.. షమీని తీసుకోకపోవడంపై మాంబ్రే చెప్పిన కారణాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బంగ్లాతో మ్యాచ్‌లో అరుదైన దృశ్యం! 6 ఏళ్ల తర్వాత అలా చేసిన కోహ్లీ!