iDreamPost
android-app
ios-app

హీరోయిన్ అందం! కానీ.. రోడ్లపై డెలివరీ గర్ల్! షాకింగ్ ట్విస్ట్!

హీరోయిన్ అందం! కానీ.. రోడ్లపై  డెలివరీ గర్ల్! షాకింగ్ ట్విస్ట్!

ఫుడ్ కానీ ఇతర వస్తువులు డెలివరీ చేసే వాళ్లలో పురుషులు ఎక్కువగా కనిపిస్తారు. ఎక్కడో ఓ చోట మహిళలు తారసపడుతుంటారు. అయితే ఏ డెలీవరి బాయ్స్/గర్ల్స్ చూసినా.. ఎంతో చెమటోడ్చుతూ.. టెన్షన్ టెన్షన్‌గా ఉన్నట్లు కనిపిస్తుంటారు. కానీ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటోలో ఆర్డర్ చేస్తే.. అందమైన అమ్మాయి డెలివరీ చేయొచ్చేమో బహుశా. ధూమ్ సినిమాలో ఉపయోగించిన కాస్ట్లీ బైక్, హీరోయిన్ రేంజ్ యువతి.. ఫుడ్ డెలివరీ చేస్తుంది. జొమాటో బ్యాగ్ వీపుకు తగిలించుకుని.. ధూమ్ ధామ్ గా రోడ్లపై దూసుకుంటూ వెళ్లిపోతుంది. రోడ్లపై వెళుతున్న జనాలు.. ఆమెను చూసి నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం ఆ యువతి వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో వివరణనిచ్చింది జోమాటో. కాగా, ఈ వీడియోను చూస్తే.. కొంచెం ఓవర్ అనిపిస్తుందని అనిపించక మానదు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జొమాటో మార్కెటింగ్ హెడ్ ఆలోచనల్లో భాగమేనని, మోడల్‌తో ఉదయం, సాయంత్రం ఇలా ప్రచారం చేయిస్తున్నారని వార్తలు రావడంతో స్పందించారు ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్. ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)లో ఈ వాదనలు ఖండించారు. జొమాటోకు ఈ అమ్మాయి, ఆ ప్రచారానికి సంబంధం లేదని, ఇండోర్ లో తమకు ఎలాంటి మార్కెటింగ్ హెడ్ లేరని తేల్చి చెప్పారు. అలాగే హెల్మెట్ లేని రైండింగ్ ను తమ సంస్థ ప్రోత్సహించదని పేర్కొన్నారు. జొమాటో కోసం ఆహారాన్ని డెలివరీ చేయడం ద్వారా జీవనోపాధిని, వారి కుటుంబాల కోసం వారు కష్టపడుతున్న తీరు పట్ల గర్విస్తున్నామంటూ పేర్కొన్నారు.