iDreamPost
android-app
ios-app

రాజమౌళి మళ్ళీ మాట మార్చక తప్పదా

  • Published Oct 08, 2021 | 5:05 AM Updated Updated Oct 08, 2021 | 5:05 AM
రాజమౌళి మళ్ళీ మాట మార్చక తప్పదా

వచ్చే సంక్రాంతి జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదలవుతుందని ఎంతో ధీమాగా ఉన్న తరుణంలో ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. మరోసారి వాయిదా తప్పకపోవచ్చని వాటి సారాంశం. మరి అలాంటప్పుడు డేట్ ఎందుకు చెప్పారనే అనుమానం రావొచ్చు. ఇప్పటికే ఇతర బాషల డబ్బింగ్ హక్కులు కొన్న నిర్మాతలు, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకే అనౌన్స్ మెంట్ ఇచ్చారు తప్ప నిజానికి ఆ టైంకంతా అన్ని పనులు పూర్తి చేయడం అసాధ్యమే అంటున్నారు. ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేతిలో కేవలం 90 రోజులే ఉన్న నేపథ్యంలో ఇలాంటి డౌట్లు రావడం సహజం.

ఈ కారణంగానే భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సర్కారు వారి పాటలు తమ డేట్లకు ధీమాగా కట్టుబడి ఉన్నాయని మరో వార్త వినిపిస్తోంది. అజిత్ వలిమై కూడా తప్పుకునే ఉద్దేశంలో కనిపించడం లేదు. అందుకే ఆర్ఆర్ఆర్ ని జనవరి 26 లేదా ఈ గోలా ఒత్తిడి ఎందుకు అనుకుంటే మార్చికి వాయిదా వేసే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయట. నిజానికి జక్కన్న రేంజ్ ప్రమోషన్ ట్రిపుల్ ఆర్ కి ఇంకా మొదలుకాలేదు. ఆ మధ్య విడుదల చేసిన ఆడియో సింగల్ హడావిడి చేసింది కానీ బాహుబలి రేంజ్ స్పందన దక్కించుకోలేదు. దీనికన్నా పుష్ప పాట ఆన్ లైన్ లో ఎక్కువ హడావిడి చేయడం గమనార్హం. అందుకే మరో సాంగ్ కి రెడీ అవుతున్నారు జక్కన్న.

అధికారిక ప్రకటన వచ్చేదాకా ఇదంతా నిజమా కాదా చెప్పలేం కానీ జనవరి 7 మీద సైతం తారక్ చరణ్ ఫ్యాన్స్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదని సోషల్ మీడియాని గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే దాకా గుండెల మీద చెయ్యి వేసుకుని తమ హీరోల సినిమా రిలీజ్ అవుతుందని చెప్పలేమని వాళ్ళే అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఏదైనా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి అసలు ఆర్ఆర్ఆర్ ఏ స్టేజి లో ఉంది, జనవరి 7 వచ్చేందుకు ఖచ్చితమైన అవకాశాలు ఎన్ని ఉన్నాయి లాంటి క్లారిటీ ఇస్తే డిస్ట్రిబ్యూటర్లకు ఇతర నిర్మాతలకు ఉపయుక్తంగా ఉంటుంది. మరి జక్కన్నఆ పని చేస్తారా చూడాలి

Also Read : బ్యాంకులకు 338 కోట్లు టోకరా వేసిన ‘నిర్మాత