iDreamPost
android-app
ios-app

రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా…

రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా…

టీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి బాగానే ప్రయత్నిస్తున్నారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డిని పీసీసీ గా ఎన్నిక చేయడంతో తన మార్కు చూపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే క్షేత్ర స్థాయిలో పార్టీకి పూనర్వైభవం తేవాలని తన టీంలోని వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బాధ్యతలు అందించారు. పీసీసీతో పాటే వివిధ కమిటీలను హై కమాండ్ ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తన టీం లోని 5గురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంటరీ స్థానాల వారీగా బాధ్యతలు అప్పగించారు.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎన్నికైన గీత రెడ్డి,జగ్గారెడ్డి, అజారుద్దీన్, మహేష్ గౌడ్,అంజన్ కుమార్ గౌడ్ లకు పార్లమెంట్ స్థానాలతో అనుబంధ విభాగాల వారీగా బాధ్యతలు అప్పగించారు.

గీతారెడ్డికి సికింద్రాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు పార్టీ అనుబంధ విభాగాలైన ఎన్‌ఎస్‌యూఐ, మేధావుల విభాగం, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ బాధ్యతలను అప్పగించారు. అంజన్‌కుమార్‌ యాదవ్‌కు నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మెదక్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలు.. యువజన కాంగ్రెస్‌, మైనారిటీ, మత్స్యకార విభాగాలను అప్పజెప్పారు.

అజహరుద్దీన్‌కు ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సోషల్‌ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు రేవంత్‌రెడ్డి.. ఇక.. జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్‌, భువనగిరి, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు మహిళా కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ, కార్మిక విభాగం బాధ్యతలు ఇచ్చారు.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సేవాదళ్‌ విభాగాలను అప్పజెప్పిన రేవంత్‌రెడ్డి.. పని విభజన చేసి.. మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో కొంత జోష్ వచ్చిన సీనియర్ల నుండి సహకారం కరువైంది. ప్రజా సమస్యలపై వరుసగా రేవంత్ రెడ్డి చేస్తున్న నిరసనలు ,ధర్నాలకు సీనియర్లు ఎవరు హాజరు కావడం లేదు. అయిన రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆగస్ట్ 9న ఆదిలాబాద్ లో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంపై స్థానిక నేతల నుండి వ్యతిరేకత వ్యక్తం అయింది. స్థానిక నేతలకు చెప్పకుండా అధ్యక్షుడు ఎలా నిర్ణయం తీసుకుంటారని సమావేశంలో నిర్మల్ జిల్లా నాయకుడు మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దింతో ఆగ్రహించిన రేవంత్ నిర్మల్ జిల్లా వరకే పరిమితం కావాలని ఆదిలాబాద్ తో మాహేశ్వర్ రెడ్డికి పనిలేదని సూచించారు.

అంతర్గత ప్రజాస్వామ్యo ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో రేవంత్ వచ్చాక గ్రూప్ రాజకీయాలు సద్దుమనిగినట్లు తెలుస్తోంది. రేవంత్ కూడా గ్రూప్ రాజకీయాల మీద గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యలపై, పార్టీ బలోపేతం కోసం మాత్రమే పని చేయాలని కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మళ్ళీ రేవంత్ రెడ్డి హయాంలో పూనర్వైభవం వస్తుందో చూడాలి.