iDreamPost
android-app
ios-app

బాబుకు.. ప‌వ‌న్ ఐ ల‌వ్ యు చెబుతారా..?

బాబుకు.. ప‌వ‌న్ ఐ ల‌వ్ యు చెబుతారా..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన, బీజేపీ మ‌ళ్లీ క‌లిసి పోటీ చేస్తాయ‌నేది మెజార్టీ వ‌ర్గాలు ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాయి. అమ‌రావ‌తి స‌భ అనంత‌రం న‌మ్మ‌కాలు పెరిగాయి. ఎందుకంటే.. అంద‌రూ క‌లిస్తే కానీ ఏపీలో మ‌నుగ‌డ సాధించే ప‌రిస్థితిలో లేమ‌ని విప‌క్షాల్లో అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మూడు పార్టీలూ క‌లిసే వైసీపీని ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా స‌మీక‌ర‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు జ‌న‌సేన‌పై త‌న ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించారు. ఫీల్ మై ల‌వ్ అంటూ ఆ పార్టీకి సంకేతాలు పంపారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు అంద‌రినీ ప్రేమించ‌డం బాబుకు అలవాటే.

ఆ విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న‌బెడితే.. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ – జనసేనతో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సైకిల్‌ పార్టీ.. ఆ తర్వాత వాటికి హ్యాండిచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో సింగిల్‌గానే సవారీ చేయబోయి బొక్క బోర్లా పడింది. ఫలితంగా మళ్లీ మిత్రుల అవసరం తమ్ముళ్లకు కనిపిస్తోంది. చంద్రబాబు చిత్తూరు టూర్‌లో చేసిన కామెంట్లు, కేడర్‌ కోరస్‌లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. కుప్పంలో గురువారం నాడు రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబును.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఓ తెలుగు తమ్ముడు కోరాడు. దీనిపై స్పందించిన చంద్రబాబు..లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీన్ని బ‌ట్టి కేడర్‌ నుంచి లీడర్స్‌ వరకు జనసేనతో బంధంపై టీడీపీ శ్రేణులు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల లోకేష్ కూడా గుంటూరులో జ‌న‌సేన పార్టీకి వెళ్లి అక్క‌డి నేత‌ల‌కు స్నేహ హ‌స్తం అందించారు. వీటిని బ‌ట్టి కొంతకాలంగా తమకు, టీడీపీ మధ్య రహస్య బంధం ఉందని జరుగుతున్న ప్రచారం వెనుక వాస్త‌వం ఉంద‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. కానీ, టీడీపీతో తమకు ఎలాంటి స్నేహం లేదని, సొంతంగా అధికారంలోకి రావాలన్నదే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఇప్ప‌టికీ పవన్ పైకి చెబుతున్నారు. కానీ బాబు మాత్రం ప‌వ‌న్.. ప‌వ‌న్.. అని క‌ల‌వ‌రిస్తున్నారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అనే ముద్ర ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తాజాగా కూడా మ‌రోసారి ఆ వ్యాఖ్యలు చేశారు.

మ‌రి.. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కూడా చంద్ర‌బాబును ప్రేమిస్తాడా అనే చ‌ర్చ అయితే మొద‌లైంది. అయితే.. టీడీపీపై తీవ్ర స్థాయిలో ఎప్పుడూ ప‌వ‌న్ విమ‌ర్శించింది లేదు. పైగా.. కొన్ని అంశాల‌పై రెండు పార్టీల ఎజెండా ఒక్క‌టే అన్న‌ట్టుగా ఉండేది. అలాగే.. ప‌వ‌న్ కు కూడా ఒంట‌రిగా పోటీ చేసే బ‌లం లేదు. బీజేపీతో జ‌త క‌ట్టిన‌ప్ప‌టికీ అది అంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌డం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ కు కూడా బాబుపై ల‌వ్ ఉంటే.. ఎప్పుడు బ‌హిరంగంగా వ్య‌క్త‌ప‌రుస్తారో వేచి చూడాలి. 

Also Read : బాబు లవ్ మామూలిది కాదు అంతకు మించి.. సోము భలే లెక్కలు చెప్పాడే!