iDreamPost
android-app
ios-app

నయన్ అంత రిస్క్ చేయగలదా

  • Published Aug 05, 2020 | 9:54 AM Updated Updated Aug 05, 2020 | 9:54 AM
నయన్ అంత రిస్క్ చేయగలదా

ప్రస్తుతం రంగ్ దే బాలన్స్ పార్ట్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్న హీరో నితిన్ ఆ తర్వాత అందాదున్ రీమేక్ మొదలుపెట్టాలి. లాంఛనంగా లాక్ డౌన్ కు చాలా రోజుల ముందే పూజా కార్యక్రమాలు చేశారు కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. దీనికి సంబంధించిన ఒక తాజా అప్ డేట్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒరిజినల్ వెర్షన్ లో కథకు కీలక కేంద్రంగా నిలిచే షేడ్స్ ఉన్న పాత్రని టబు పోషించింది. ఆ రోల్ కోసం అనసూయ, రమ్యకృష్ణ ఏవేవో ఆప్షన్స్ ట్రై చేశారు కానీ అవేవి వర్కవుట్ అయినట్టు లేవు. తాజాగా తెరమీదకు నయనతార పేరు వచ్చింది. తనతో టీమ్ చర్చలు జరుపుతున్నట్టు, కొంత సానుకూలత వ్యక్తం అవుతున్నట్టు వినికిడి. అయితే దీన్ని పూర్తి వాస్తవమని నమ్మడానికి లేదు.

నయన్ ప్రస్తుతం హీరోయిన్ గా భీభత్సమైన ఫామ్ లో ఉంది. తమిళ్ లోనే మహా బిజీగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇమేజ్ ని రిస్క్ చేసేందుకు ఒప్పుకుంటుందా అనేదే అందరి అనుమానం. కారణం ఉంది. అందులో ఈ పాత్రకు ఓ లేట్ ఏజ్ వాడితో పెళ్లవడంతో పాటు ఒక ఎఫైర్ కూడా ఉంటుంది. అదే కథలో చాలా కీలకంగా నిలిచే టర్నింగ్ పాయింట్. క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఎంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చినా ఇలాంటివి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాలో సమంతా కూడా ఇలాంటి ఛాయలు ఉన్న పాత్ర చేసింది కానీ దీంతో పోల్చలేం. అది మరీ నెగటివ్ గా ఉండదు. అందులోనూ సామ్ దర్శకుడి బ్రాండ్ మీద ఒప్పుకున్నా చిత్రమది.

ఇక్కడ ఆడదని తెలుగులో డబ్బింగ్ కూడా చేయలేదు. సో నయనతార ఈ ఉదాహరణ తీసుకోకపోవచ్చు. దర్శకుడు మేర్లపాక గాంధీకి ఇదే పెద్ద ఛాలెంజ్ గా మారిందట. ఎవరో ఆషామాషీ ఆర్టిస్టుని తీసుకుంటే పని జరగదు. పోనీ టబునే మాట్లాడుకోవచ్చు కదా అంటే తన కాల్ షీట్స్ టైట్ గా ఉన్నాయట. అందులోనూ రెండోసారి అదే పాత్ర పట్ల అంత సుముఖంగా లేదని కూడా తెలిసింది. మొత్తానికి ఇది ఫైనల్ అయితే తప్ప అందాదున్ రీమేక్ వ్యవహారం అంత ఈజీగా సాగదు. నితిన్ రంగ్ దే పూర్తి చేసిన వెంటనే ఇది మొదలుపెట్టాలి. ఆ తర్వాత దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, కృష్ణ చైతన్యలకు నితిన్ కమిటయ్యాడు. ఇంకో రెండేళ్ల దాకా డైరీ ఖాళీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.