iDreamPost
iDreamPost
ఇంకా షూటింగ్ మొదలుకావడానికి చాలా టైం ఉన్నప్పటికీ ప్రభాస్ 22వ సినిమా ఆదిపురుష్ అప్పుడే ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న డార్లింగ్ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. సాహో ఇక్కడ ఫెయిలైనప్పటికీ బాలీవుడ్ లో కమర్షియల్ గా బాగా పే చేయడంతో రాధే శ్యామ్ హక్కులు కొనడంతో పాటు ఆదిపురుష్ ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తోంది టి సిరీస్. ఇందులో ప్రభాస్ రాముడిగా నటించబోతున్నాడన్న క్లారిటీ దాదాపు వచ్చేసినట్టే. సీత పాత్రలో హీరోయిన్ ఎవరు ఉంటారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం దర్శకుడు ఓం రౌత్ కీయరా అద్వాని వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. కొద్దిరోజుల క్రితం కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపించింది. సౌత్ లో పర్ఫార్మెన్స్ పరంగా తను బెస్ట్ ఛాయస్ గా నిలుస్తోంది. అయితే నార్త్ ఆడియన్స్ కు తను తెలియదు. ఆడపాదడపా డబ్బింగ్ సినిమాల్లో కనిపించడమే తప్ప కీర్తి ఎంత గొప్ప యాక్టరో ఇంకా వాళ్ళకు పరిచయం లేదు. అలాంటప్పుడు తనను తీసుకుంటే మార్కెట్ పరంగా ఇబ్బందులు కలగవచ్చు. అదే కీయరా అద్వానీ అయితే ఈ సమస్య ఉండదు. కానీ సీత అంత బరువైన పాత్రను మోయగలదా అనేదే అసలు అనుమానం. సానబెడితే ఎవరైనా చేస్తారనేది నిజమే అయినా వందల కోట్ల బడ్జెట్ తో రిస్క్ చేస్తున్నప్పుడు ప్రయోగాలకు అవకాశం ఇవ్వకూడదు కదా.
అయినా కియారా కూడా లుక్స్ పరంగా చక్కగా ఉంటుంది కాబట్టి సీతకు రైట్ ఛాయస్ అనుకోవచ్చు. ఓం రౌత్ మాత్రం వీటికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇచ్చే మూడ్ లో లేడు. రాధే శ్యాం తర్వాత నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కంటే ముందు ఆదిపురుష్ ని తక్కువ టైంలో పూర్తి చేసే ఆలోచనలు కూడా జరుగుతున్నాయట. మూడు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చేసిన ప్రభాస్ చూసేందుకు బిజీగానే కనిపిస్తున్నాడు కానీ ఒక్కో సినిమా విడుదలకు వచ్చే గ్యాప్ తలుచుకుంటేనే అభిమానుల గుండెలు జారిపోతున్నాయి. లాక్ డౌన్ రాకపోయి ఉంటె రాధే శ్యాం కనీసం ఏడాది చివరిలోనో సంక్రాంతికో వచ్చేది. ఇప్పుడా అవకాశమే లేకుండా పోయింది. ఏదైనా సరే షూటింగులు అయ్యేదాకా విడుదల గురించి ఎవరూ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది