iDreamPost
android-app
ios-app

అస్సాంలో సీఎం రేసు…ముందు స్థానంలో నిలిచిన హిమంత బిస్వా శర్మ…

అస్సాంలో సీఎం రేసు…ముందు స్థానంలో నిలిచిన హిమంత బిస్వా శర్మ…

సర్బనందకు నిరాశ మిగిలే చాన్స్…

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తరువాత అస్సాం ముఖ్యమంత్రి పదవి రేసులో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ ముందు వరసలో ఉన్నాయి. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్థానంలో హిమంతకు పదవి ఇవ్వాలని ఇఫ్పటికే ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మరోవైపు హిమంత బిస్వా శర్మ అస్సాం తరువాతి ముఖ్యమంత్రిగా పేరు పొందే అవకాశం ఉందని, ఢిల్లీ వర్గాలు కూడా లీకులు విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం సీఎం పదవిలో ఉన్న సర్బానంద్ సోనోవాల్‌ను ఢిల్లీకి పిలిపంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హిమంత బిస్వా శర్మ వర్గం తమకు ఈసారి సీఎం పదవి ఇవ్వాల్సిందే అని పట్టుపట్టింది. మరోవైపు మాజీ కాంగ్రెస్ నేత అయిన హిమంత బిస్వా శర్మ, తన వర్గం ఎమ్మెల్యేలతో గందరగోళం చేయకముందే, ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం తలమనుకలు అయి ఉంది. నిజానికి సీఎం అవ్వాలనే ఏకైక ఆశయంతోనే హిమంతా బిస్వా శర్మ గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి అడుగుపెట్టారు. ఈ సారి కూడా ఆయనకు పదవి దక్కకపోతే, ఆయన ఎలాంటి రాజకీయ మలుపు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయం తెలిసిన బిజెపి కీలక నాయకుడు ఒకరు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన పరిణామాల్లో శర్మ పేరును ఆమోదం తెలిపినట్లు, త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే శనివారం ప్రస్తుత సిఎం సర్బానంద సోనోవాల్, హిమంత బిస్వా శర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ లను కలిశారు. నడ్డా నివాసంలో జరిగిన సమావేశాలు రెండు రౌండ్లలో జరిగాయని నాయకుడు తెలిపారు. సమావేశాల తరువాత సోనోవాల్ , హిమంత శర్మ ఇద్దరూ గత రాత్రి ప్రత్యేక విమానంలో గువహతికి వచ్చారు.

ప్రస్తుతానికి శర్మ రేసులో స్పష్టంగా ముందున్నప్పటికీ, “పరిస్థితి ఇంకా ద్రవ స్థితిలోనే ఉందని, ఎటు వైపు అయినా మారవచ్చు” అని అస్సాం బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఎందుకంటే శాసనసభ పక్షం ఇంకా తన నాయకుడిని ఎన్నుకోవటానికి సమావేశం ఇంకా జరగలేదు. అయితే, ఈ సమావేశం ఇప్పుడు ఒక లాంఛనప్రాయమని హిమంతబిస్వ శర్మ మద్దతుదారులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో తదుపరి సీఎం హిమంత బిస్వా శర్మ పేరును ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ఎన్ఎస్ తోమర్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కేంద్ర పరిశీలకులుగా ఉంటారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.