iDreamPost
android-app
ios-app

బాబు పిటీషన్ పై సానుకూల స్పందన దక్కేనా, 23 టెన్షన్ తగ్గేనా?

  • Published Mar 19, 2021 | 2:29 AM Updated Updated Mar 19, 2021 | 2:29 AM
బాబు పిటీషన్ పై సానుకూల స్పందన దక్కేనా, 23 టెన్షన్ తగ్గేనా?

టీడీపీ అధినేతకు 23 టెన్షన్ కొనసాగుతోంది. ఈనెల 23న విచారణకు హాజరుకావాల్సిందేనని ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులతో ఆయన కలవరపడుతున్నారు. ఎస్సీ , ఎస్టీ అసైన్డ్ భూముల వ్యవహారంలో అవినీతి బయటపడడంతో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.

అమరావతి భూ కుంభకోణంలో ఆయనతో పాటు , ఆయన క్యాబినెట్ సహచరుడు పి నారాయణకి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కోర్టుని ఆశ్రయించారు. సీఐడీ నోటీసులు చట్టవిరుద్ధమని , వాటిని రద్దు చేయాలని కోరుతూ స్క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు, నారాయణ ఇద్దరూ పిటీషన్లు వేయడం విశేషం.

Also Read:అమరావతి భూముల కేసు – చంద్రబాబు ఇంటికి సిఐడి

మార్చి 22న విచారణకు రావాలని నారాయణకు, మార్చి 23 విచారణకు రావాలని చంద్రబాబు నాయుడిని అలాగే మార్చ్ 19 న రావాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికీ సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తన దగ్గరున్న ఆధారాలు సమర్పించారు.

Also Read:బీసీలు, మహిళలతో కోట కట్టుతున్న జగన్

కానీ చంద్రబాబు, నారాయణ మాత్రం విచారణకు ససేమీరా అంటున్నారు. అంతేగాకుండా 41 ఏ కింద నోటీసులు ఇచ్చి, ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారని ఇది చట్ట విరుద్ధం అని వారి పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని వారి న్యాయవాదులు కోరగా శుక్రవారం ఉదయం విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది. దాంతో ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుందోననే చర్చ సర్వత్రా సాగుతోంది. రాజకీయంగా అనేక ఆరోపణలు, అవినీతి కుంభకోణాలు విషయంలో చంద్రబాబు స్టేలతో కాలయాపన చేయడంతో సిద్ధహస్తుడనే పేరు ఉంది. ఇప్పుడు అమరావతి భూకుంభకోణంలో కూడా అదే పంథాలో సాగేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

Also Read:బాబు – సీఐడీ ఆఫీస్‌కు వస్తారా..? కోర్టుకు వెళతారా..?

విచారణకు హాజరయ్యి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బదులుగా విచారణ జరగకుండా చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. అయితే ఇప్పటికే అమరావతి కేసుల్లో విచారణను అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిన తరుణంలో చంద్రబాబు పిటీషన్ పై ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికర అంశం అవుతుంది. బాబు,నారాయణ స్క్వాష్ పిటీషన్ కోర్టు అనుమతించకపోతే మాత్రం ఈనెల 23న ఆయన సీఐడీ విచారణకు రావాల్సి ఉంటుంది.. ఆ తదుపరి పరిణామాలు పలు మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది.