iDreamPost
android-app
ios-app

కింగ్ స్థానంలో భల్లాలదేవా ?

  • Published Jun 29, 2021 | 5:49 AM Updated Updated Jun 29, 2021 | 5:49 AM
కింగ్ స్థానంలో భల్లాలదేవా ?

వివాదాలు రెస్పాన్స్ రేటింగ్స్ సంగతి ఎలా ఉన్నా తెలుగు బిగ్ బాస్ మాత్రం ప్రతి సీజన్ చివరికి వచ్చేటప్పటికీ మంచి పాపులారిటీనే దక్కించుకుంటోంది. హిందీ తమిళ్ లాంటి ఇతర బాషలతో పోలిస్తే ఇక్కడి సిరీసే కొంచెం వీక్ అనే కామెంట్ లో వాస్తవం లేకపోలేదు. స్టాండర్డ్ గా ఒకే యాంకర్ దీన్ని కొనసాగించపోవడం ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున ఇలా చేతులు మారుతూ వచ్చింది. కానీ సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఇతర భాషల్లో ఎన్ని సీజన్లైనా పట్టువదలకుండా చేస్తూనే ఉన్నారు. మన దగ్గరా ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే బాగానే ఉంటుంది కానీ అదే పెద్ద సవాల్ గా మారింది.

ఇక బిగ్ బాస్ 5 త్వరలోనే స్టార్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక కొత్త అప్ డేట్ షాక్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఈ సారి వ్యాఖ్యాతగా నాగార్జున ఉండకపోవచ్చట. కరోనా వల్ల చాలా నెలలు వృధా కావడంతో ఇకపై సినిమాలకు ఎక్కువ టైం కేటాయించి షూటింగ్స్ లో బిజీ ఉండేందుకు నిర్ణయించుకోవడంతో మార్పు తప్పకపోవచ్చని టీవీ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి స్టార్ మా ఛానల్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. తన స్థానంలో భల్లాలదేవా రానాని దించవచ్చని అంటున్నారు. ఎలాగూ రానాకు షోలు ఇంటర్వ్యూలు నడిపించిన అనుభవ పుష్కలంగా ఉంది.

అధికారికంగా చెప్పే దాకా ఖరారు చేయలేము కానీ నాగార్జున కమిట్ మెంట్స్ చూస్తే నిజమైనా ఆశ్చర్యం లేదు. ఒకపక్క ప్రవీణ్ సత్తారు సినిమా చేస్తూనే మరోవైపు బంగార్రాజు ప్రీ ప్రొడక్షన్ వైపు దృష్టి పెడుతున్న కింగ్ వీటి తర్వాత చేయాల్సిన సినిమాల కోసం కథలు వింటున్నారట. వెబ్ సిరీస్ ఆలోచన కూడా ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. హిందీలో చేసిన బ్రహ్మాస్త్ర విడుదల కావాల్సి ఉంది. సో బిగ్ బాస్ 5ని నాగార్జునే కంటిన్యూ చేస్తారా లేక రానా అదీ కుదరకపోతే ఇంకెవరైనా కొత్త హోస్ట్ వస్తారా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే పార్టిసిపెంట్స్ ని సగానికి పైగా ఎంపిక చేసేసినట్టు వినికిడి.