iDreamPost
android-app
ios-app

మే 2 తర్వాత ఏం జ‌ర‌గ‌బోతోంది..!

మే 2 తర్వాత ఏం జ‌ర‌గ‌బోతోంది..!

ఢిల్లీ, కర్నాటకలో ఇప్పటికే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. దేశ రాజధాని లో వారం పాటు అని ప్రకటించిన లాక్‌డౌన్‌ మరో వారం పొడిగించారు. తెలుగు రాష్ట్రాల‌లో కూడా రాత్రి కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌లో భాగంగా మొదటి అడుగు అని కొందరు భావిస్తున్నారు. అలాగే, రేషన్‌ బియ్యం ఇస్తామని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించడం మున్ముందు లాక్‌డౌన్‌ ఉంటుందనే దానికి సంకేతమని మ‌రి కొంద‌రి అభిప్రాయం. పలువురి అభిప్రాయం. రాష్ట్రంలో మహమ్మారి విజృంభణ.. పలు రాష్ర్టాల్లో పరిస్థితి చేదాటు తోన్న దృష్ట్యా.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మే2న ఐదు రాష్ట్రాలతో పాటు అన్ని ఉపఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. మే2 ఫలితాలు ప్రకటించిన తర్వాత వెంటనే, కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంద‌ని, మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో అస‌లేం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ ఏర్ప‌డింది.

కరోనా వైరస్ విజృంభణ తో ఇండియా ప్రస్తుతం విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. .కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని ఆ సమావేశంలో లాక్డౌన్ విధింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆక్సీజన్ సరఫరా అత్యవసర మందులు వ్యాక్సినేషన్పై ప్రధాని మోదీ వరుస సమావేశాలకు ఇదే కారణమని అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు మే జూన్ నెలలో దేశ ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 80 కోట్ల మంది పేదలకు బియ్యం గోధుమలను పంపిణీ చేస్తామని తెలిపింది.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారని.. అందుకే ఉచిత రేషన్పై కేంద్రం ప్రకటన చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ మరోసారి వద్దు అని అనుకున్నా కూడా .. కరోనా సెకండ్ పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో లాక్డౌన్ తప్ప వేరొక మార్గం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ పై స్పష్టత రావాలి అంటే మే 2 వరకు వేచి చూడాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్రాల ఇష్టమేనని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయడం లేదని సర్వత్రా వినిపిస్తున్న మాట. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అడ్డంకిగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.