iDreamPost
android-app
ios-app

OTTలో వైల్డ్ డాగ్ : డేట్ ఫిక్స్ ?

  • Published Jan 02, 2021 | 6:38 AM Updated Updated Jan 02, 2021 | 6:38 AM
OTTలో వైల్డ్ డాగ్ : డేట్ ఫిక్స్ ?

థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటిటి హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు. 50 శాతం ఆక్యుపెన్సీ ఇంకెంత కాలం ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో కొందరు డిజిటల్ వైపే మొగ్గు చూపుతున్నారు. కొందరి అగ్రిమెంట్లు లాక్ డౌన్ టైంలో జరగడంతో వాటి రిలీజులు ఇప్పుడు జరగబోతున్నాయి. తాజాగా నాగార్జున వైల్డ్ డాగ్ కూడా ఓటిటి బాట పట్టిందని ఫిలిం నగర్ టాక్. నెట్ ఫ్లిక్స్ హక్కులు కొనుగోలు చేసిందని జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రీమియర్ చేయబోతోందని ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందట. డీల్ అయితే కన్ఫర్మ్ అయ్యింది.

డెబ్యూ మూవీగా అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించిన వైల్డ్ డాగ్ లో సయామీ ఖేర్ తో పాటు దియా మీర్జా, అతుల్ కులకర్ణి, అలీ రెజాలు ఇతర కీలక పాత్రలు పోషించారు. యాంటీ టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో ఎలాంటి కమర్షియల్ అంశాలు, ఐటెం సాంగ్స్, మసాలా ఫైట్స్ లాంటివి ఉండవు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. బహుశా నాగ్ కెరీర్ లో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ఆడిపాడే హీరోయిన్ లేకుండా ఇప్పటిదాకా నాగ్ ఏ సినిమాను తెలుగులో చేయలేదు. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు.

అయితే వైల్డ్ డాగ్ ని ముందు చెప్పినట్టు ఈ నెలలోనే తీసుకొస్తారా లేక ఇంకా వేచి చూసి మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో లేట్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇటీవలే బిగ్ బాస్ 4 సీజన్ ని దిగ్విజయంగా పూర్తి చేసిన నాగార్జున తర్వాత చేయబోయే సినిమాల గురించి ఇంకా ఏమి చెప్పడం లేదు. ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ తాత్కాలికంగా పెండింగ్ లో పడినట్టు వినికిడి. ఇది కాకుండా సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా చాలా కాలంగా హోల్డ్ లో ఉంది. నాగ్ స్పెషల్ రోల్ చేసిన బాలీవుడ్ మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్ర ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నాగ్ కథలు వినే పనిలో బిజీగా ఉన్నారట.