iDreamPost
ఇండియా వినోద పరిశ్రమ విలువు $24 బిలియన్లు. మాస్ పల్స్ ను పట్టేసిన రీజనల్ సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినీ మార్కెట్ ను శాసిస్తున్నాయి. దక్షిణాది సినీ నిర్మాతలు యాక్షన్-ప్యాక్డ్ మూవీలను వరసపెట్టి వదులుతుంటే, నార్త్ ఇండియా అభిమానులు ఆవురావురమంటూ మహారాజపోషకులైపోతున్నారు
ఇండియా వినోద పరిశ్రమ విలువు $24 బిలియన్లు. మాస్ పల్స్ ను పట్టేసిన రీజనల్ సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినీ మార్కెట్ ను శాసిస్తున్నాయి. దక్షిణాది సినీ నిర్మాతలు యాక్షన్-ప్యాక్డ్ మూవీలను వరసపెట్టి వదులుతుంటే, నార్త్ ఇండియా అభిమానులు ఆవురావురమంటూ మహారాజపోషకులైపోతున్నారు
iDreamPost
ఇండియన్ సినిమా త్రాచు బాలీవుడ్ నుంచి దక్షిణాది సినిమా రంగంవైపు మొగ్గుచూపుతోంది. ఇండియన్ సినిమా అంటే మిగిలిన ప్రపంచానికి బాలీవుడ్. కాని ఇండియాలో లెక్కవేస్తే తెలుగు సినిమా రంగానికి సరితూగడంలేదు. ఇండియా వినోద పరిశ్రమ విలువు $24 బిలియన్లు. మాస్ పల్స్ ను పట్టేసిన రీజనల్ సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినీ మార్కెట్ ను శాసిస్తున్నాయి. దక్షిణాది సినీ నిర్మాతలు యాక్షన్-ప్యాక్డ్ మూవీలను వరసపెట్టి వదులుతుంటే, నార్త్ ఇండియా అభిమానులు ఆవురావురమంటూ మహారాజపోషకులైపోతున్నారు. “K.G.F.”,“పుష్ప” యాక్షన్ ఫ్రాంచైజీలైపోయాయి. వచ్చే నాలుగైదు ఏళ్లు ఇవి వందల కోట్లను కొల్లగొట్టబోతున్నాయి. పుష్ప తెలుగు సినిమా. కేజీఎఫ్ కన్నడలో తీసిన మూవీ. ఆ తర్వాత వాటిని హిందీతో సహా వేర్వేరు భాషల్లోని ఆడియన్స్ కోసం డబ్ చేశారు.
ఇలా ఇండియన్ సినిమా మార్కెట్ దక్షిణాది వైపు మొగ్గడానికి మొదటి కారణం దర్శకుడు SS రాజమౌళి. ఆయన “RRR,” బాలీవుడ్ పై దాడిచేసింది., హాలీవుడ్ దృష్టిని ఆకట్టుకుంది. బడ్జెట్ $72 మిలియన్లు. ఇద్దరు తెలుగు సమరయోధుల కథ ప్రపంచవ్యాప్తంగా $150 మిలియన్లు వసూలు చేసింది.
అసలు హిందీ ప్రజలు దక్షిణ భారత సినిమాకు ఎందుకు పట్టం కట్టారు? ఈ ప్రశ్నకు రాజమౌళీయే మింట్ కిచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు.
మాస్ సినిమా అభిమానలకు తగ్గట్టుగా సినిమాలు తీయడం మానేశారు. భారీ యాక్షన్ సినిమాలు, హార్డ్ కోర్ ఎమోషన్స్ కోరుకొనేవాళ్లు చాలామందే ఉన్నారు. సోషల్ మీడియా వచ్చింది. యూబ్యూట్ లో సౌత్ సినిమాలు డబ్బింగ్ చేసి అప్ లోడ్ చేశారు. హిందీ జనం ఆ సినిమాలను చూడటం మొదలుపెట్టారు. హిందీ సినీ ఇండస్ట్రీ దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆశ్చర్యమేంటంటే, మేం కూడా పెద్దగా ఆలోచించలేదు. మనకు తెలియకుండానే సౌత్ యాక్షన్ సినిమాలకు భారీగా అభిమానులు తయారైయ్యారు. బాహుబలి (2015 ) వచ్చాక అంతా ఒక్కసారిగా పేలిందని విశ్లేషించారు రాజమౌళి.