iDreamPost
android-app
ios-app

పఠాన్ మీద టాలీవుడ్ ఆసక్తి ఎందుకంటే!

  • Published Jan 19, 2023 | 5:11 PM Updated Updated Jan 19, 2023 | 5:11 PM
పఠాన్ మీద టాలీవుడ్ ఆసక్తి ఎందుకంటే!

విడుదలకు ఇంకా వారం రోజులు ఉండగానే షారుఖ్ ఖాన్ పఠాన్ సంచలనాలు నమోదు చేస్తోంది. తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 6 కోట్ల దాకా వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. లక్షన్నర టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా ప్రధానమైన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అమ్మకాలు మొదలుపెట్టలేదు. రిలీజ్ టైం నాటికి షాకింగ్ ఫిగర్స్ ఉంటాయని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. ఐమ్యాక్స్ ఫార్మట్ కూడా ఉండటంతో ఈ స్క్రీన్స్ కి ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడనుంది. ప్రసాద్ లో ఇటీవలే ఆధునీకరించిన బిగ్ స్క్రీన్ లో ఫస్ట్ డే

గతంలో విడుదలైన బేషరం పాటలో దీపికా వస్త్రధారణ మీద వివాదాలు వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం థియేటర్ల వద్ద సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. పలు ప్రధానమైన నగరాల్లో ఆటలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. కంటెంట్ పరంగా షారుఖ్ చేసింది ఎలాగూ దేశభక్తుడి క్యారెక్టర్ కాబట్టి ఆ విషయంలో ఇబ్బందులు తలెత్తవు కానీ ఎటొచ్చి పాటల్లో ఎక్స్ పోజింగ్ మీదే మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ లో జాన్ అబ్రహం కరుడు కట్టిన విలన్ గా నటిస్తున్నాడు

ఈ పఠాన్ ఫలితం మీద టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే సినిమాల లిస్టులో పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కూడా ఉన్నాడు. నమ్మశక్యం కాని రీతిలో యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తాడని పేరున్న ఇతను ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడోననే అంచనాలు ఆల్రెడీ ముంబై మీడియా మొదలుపెట్టేసింది. ప్రాజెక్టు మొదలవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఈలోగా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు బోలెడు ఉంటాయి కాబట్టి పఠాన్ రన్ పూర్తయ్యాక వాటిని చూసుకుంటారు. సిద్దార్థ్ ఆనంద్ మరోవైపు రామ్ చరణ్ మీద కన్నేశాడు కానీ ప్రస్తుతమున్న కమిట్ మెంట్లలో అది సాధ్యమయ్యే సూచనలు దగ్గరలో లేవు