iDreamPost
android-app
ios-app

పీఎంఓలో వ‌రుస రాజీనామాల‌కు కార‌ణాలేంటి?

పీఎంఓలో వ‌రుస రాజీనామాల‌కు కార‌ణాలేంటి?

ప్రధాన మంత్రి కార్యాలయం.. అదే పీఎంఓ. దేశ ప్ర‌ధాని త‌న బాధ్య‌త‌ల‌ను, విధుల‌ను సమర్థవంతంగా నిర్వర్తించడంలో కీల‌క పాత్ర నిర్వ‌హిస్తుంది. దేశ పాలనా వ్యవస్థకు గుండెకాయ కేంద్ర సర్కారు అయితే.. దానికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసేది మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం. అందులోని కీలక అధికారుల అడుగులు.. ప్రధాని గమనాన్ని నిర్దేశిస్తుంటాయి. ఒకవేళ ప్రధాని తప్పు చేస్తుంటే.. అందులో పూర్తి బాధ్యత ఆయనది మాత్రమే కాదు.. ఆయనకు సలహాదారులుగా ఉండే అధికారుల లోపంగా కూడా చెప్పాలి. అంతటి కీలకమైన పదవిలో ఉన్న వేళ.. తమ రిటైర్మంట్ కు కొద్ది నెలల ముందుగా తమ పదవులకు రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సాధార‌ణ ఉద్యోగులే కాదు.. కొంద‌రు ప్ర‌ముఖులు కూడా రిటైర్మెంట్ కు ముందే చాలా మందే రాజీనామా చేశారు. అయితే పీఎంఓ అధికారులు కావ‌డ‌తో వీరి రాజీనామాపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కార్యాలయంలో సాగుతున్న వరుస పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నెల వ్యవధిలో సీచెందిన ఇద్దరు కీలక అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు వారిలో ఒకరు సీనియర్ సలహాదారు అయిన అమర్జీత్ సిన్హా కాగా.. మరొకరు మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధాల్ని చూస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా.. 2019లో గ్రామీణాభివ్రద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం 2020 ఫిబ్రవరిలో ఆయన పీఎంవోలో సలహాదారుగా ఎన్నికయ్యారు. బిహార్ క్యాడర్ కు చెందిన ఈ అధికారి.. తన పదవీ విరమణకు మరో ఏడు నెలలు మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా ఎందుకు చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

తాము తీసుకునే నిర్ణయాలతో దేశాన్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉండి కూడా.. సింఫుల్ గా వదులుకోవటం వెనుకున్న కారణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా ఇటీవల కాలంలో మోడీ ఫేం భారీగా పడిపోతున్న నేపథ్యంలో.. ఆయన వేసుకున్న ప్రణాళికలు అనుకున్నట్లుగా ముందుకు సాగకపోవటం.. తాము అనుకున్నట్లుగా పని చేసే వీలు తగ్గిపోవటం కూడా కారణమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వ్య‌క్తిగ‌త ఇబ్బందులు కార‌ణ‌మా, ఇత‌ర అంశాలు ఏమైనా ముడిప‌డి ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.