iDreamPost
iDreamPost
26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యువ ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకి మహేష్ బాబు కూడా ఓ నిర్మాత కావడం విశేషం. మేజర్ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో చాలా మంది హీరోలు ఉండగా మిమ్మల్నే ఎందుకు మేజర్ సినిమాలో హీరోగా తీసుకున్నారు అని విలేఖరి అడిగారు. దీనికి శేష్ సమాధానమిస్తూ.. ఈ బయోపిక్ అంతకుముందే బాలీవుడ్‌లో తీయడానికి ప్రయత్నించారు. కానీ, సందీప్ తల్లిదండ్రులకు వాళ్ళు నచ్చలేదు. ఆ తర్వాత మలయాళం మేకర్స్ కూడా సందీప్ తల్లి తండ్రులని అడిగినా ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చూపించిన హీరోలు తమ కొడుకులా లేరని సందీప్ తల్లి సున్నితంగా తిరస్కరించారు. నా గత సినిమాలు చూశారు వాళ్ళు. టెస్ట్ లుక్ చేసి చూపించాక ఆల్మోస్ట్ సందీప్ లాగానే ఉన్నాను అని భావించి సినిమాకి ఓకే చెప్పారు. నన్ను సందీప్ పాత్రలో చూసి వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నాలో సందీప్ ను చూసుకున్నారు. నేను సందీప్ తల్లిని ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను అని అన్నారు.
ఇక ఇందులో కేవలం ఆ రోజూ జరిగిన దాడులు మాత్రమే కాదు సందీప్ జీవితంలోని స్కూల్ డేస్, కశ్మీర్ డేస్, తాజ్ సంఘటనతో పాటు చిన్నతనంలో అమ్మతో కూర్చుని పాయసం తినడం, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడడం, ఐస్ క్రీమ్‌లు తినడం, వాళ్ళ నాన్నగారితో టైప్ రైటింగ్ గురించి మాట్లాడడం… ఇలా ఆయన లైఫ్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా చుపించాము. గొప్ప మనుషులు పుట్టరు వారు చేసే పని వల్ల గొప్ప మనిషి అవుతారు. సందీప్ అలాంటివారిలో ఒకడు అని తెలిపారు.