Idream media
Idream media
పరామర్శలు, లోకేశ్ వ్యాఖ్యలపై అధికార పార్టీ కన్నా, టీడీపీ నేతలే భారీగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. కొన్ని రోజుల కిందటే.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి.. ప్రాణాలు కోల్పోయారు. మరి ఆయన చనిపోయినప్పుడు లోకేశ్ బాబు పరామర్శకు వెళ్లలేదు. అదే సమయంలో టీడీపీ యువ నాయకుడు వానపల్లి రవికుమార్ కూడా కరోనాతో మృతి చెందారు. ఈ కుటుంబానికి కూడా టీడీపీ నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు. వీరిద్దరే కాదు.. టీడీపీ అధికార ప్రతినిధి సనపల పాండు రంగారావు ఈ మధ్యనే కరోనాతో కన్నుమూశారు. మరో అధికార ప్రతినిధి ఇమంది రమణ కూడా ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. జీవీఎంసీ ఎన్నికల్లో 52వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి పరాజయం పొందిన కామాకుల నాగేశ్వరరావు ఇటీవల అకాల మరణం పొందారు. కానీ ఆ కుటుంబాలను టీడీపీ నాయకులు ఎవరూ నేరుగా వెళ్లి పరామర్శించ లేదు. కానీ, డాక్టర్ కుటుంబ సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించడం వెనుక టీడీపీ శవ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి.
టీడీపీ నేతలు ఈమధ్య కాలంలో చాలా మంది కరోనా, ఇతర కారణాలతో ప్రాణాలు విడిచారు. ఎంతమంది చనిపోయినా… హైదరాబాద్ గడప దాటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు… వివాదాస్పద డాక్టర్ సుధాకర్ మృతి చెందితే మాత్రం పరామర్శ కోసం హడావుడిగా బయలుదేరడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే చర్చకు తెరలేపింది. పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దాలుగా సేవలందించిన నేతలు, కార్యకర్తలు చనిపోతే లోకేష్ నుంచి కనీసంగా ఫోన్‌లో కూడా పరామర్శ, సానుభూతి ఎరుగని టీడీపీ శ్రేణులకు.. ఇప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ ఇంటికి పరామర్శ కోసం ఆదుర్దాపడటం మింగుడు పడటం లేదు.
డాక్టర్ సుధాకర్ మృతి చెందిన దరిమిలా ఏకంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నివాళులర్పించారు. ఆయన ఫొటోకి పూలదండలు వేసి మరీ శ్రద్ధాంజలి ఘటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా దర్శనమిచ్చాయి. సుధాకర్‌కి నివాళులర్పించడంలో టీడీపీ శ్రేణులకు వచ్చిన అభ్యంతరాలేమీ లేవు కానీ కనీసం ఆయన పాటి అర్హత కూడా విశాఖ టీడీపీ నేతలకు లేదా అన్న ప్రశ్నలు మాత్రం తెరమీదకు వచ్చాయి. సుధాకర్‌కున్న విలువ కూడా పార్టీలో తమకు లేదా అని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈ పరామర్శలపై టీడీపీలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ పై తాజాగా టీడీపీలోనే సీనియర్ల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. ఒకరిద్దరు మౌనంగా ఉన్నప్పటికీ.. చాలా మంది మాత్రం లోకేష్ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు.