iDreamPost
android-app
ios-app

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ మీద అక్కసు ఎందుకు

  • Published Feb 20, 2022 | 9:34 AM Updated Updated Mar 09, 2022 | 1:25 PM
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ మీద అక్కసు ఎందుకు

ఆంధ్రా యూనివర్సిటీ చుట్టూ వివాదం రాజేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో టీడీపీ ప్రోద్భలంతో సీపీఐ తో పాటుగా మాజీ ఎంపీ హర్షకుమార్ రంగంలో దిగారు. విద్యార్థులను రెచ్చగొట్టేయత్నం చేస్తున్నారు. రాజకీయంగా జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ నేతలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫలితం వచ్చే వరకూ ఏదో విధంగా రచ్చ చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి తీరు మీద ఇప్పటికే పలు మార్లు టీడీపీ వివాదం సృష్టించాలని చూసింది. వాటిని విద్యార్థులు గానీ, విశాఖ వాసులు గానీ విశ్వసించలేదు. దాంతో టీడీపీ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం రాకపోవడంతో ఈసారి విద్యార్థులను ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన యూనివర్సిటీ ప్రతిష్టను పెంచేందుకు వీసీ ప్రయత్నించడం టీడీపీనేతలకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు సమీప బంధువులకు చెందిన విద్యాసంస్థల ఆటలు సాగకపోవడంతో ఏయూ వీసీ మీద బురజల్లే ప్రయత్నానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది.

గతం నుంచి విశాఖలో ఏయూ వీసీని టీడీపీ నేతలు గుప్పిట్లో పెట్టుకుని పలు వ్యవహారాలు చక్కదిద్దుకున్నారు. మాజీ ఎంపీ కుటుంబానికి చెందిన విద్యాసంస్థల నిర్మాణం కోసం ఏయూ నుంచి అడ్డంకులు లేకుండా చేసుకోవడంలో వారి ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ ప్రాధాన్యత తగ్గించేందుకు సైతం వెనకాడకుండా సొంత సంస్థల ప్రయోజనాల కోసం యూనివర్సిటీ విలువను పణంగా పెట్టిన వైనం కూడా ఉంది. కానీ ఇటీవల అలాంటి ప్రయత్నాలు సాగడం లేదు. వారి ఆటలు సాగకపోవడంతో వీసీ మీద గురిపెట్టినట్టు కనిపిస్తోంది. వీసీని అడ్డు తొలగించుకునే లక్ష్యంతో రీ వాల్యూషన్ లో అక్రమాలు, నిధుల వినియోగంలో అవినీతి అంటూ నిందలు ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. తద్వారా యూనివర్సిటీ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రసాదరెడ్డికి సీఎం ఆశీస్సులుండడంతో తమ ఆటలు సాగడం లేదని భావిస్తున్న నేతలంతా ఇప్పుడు వీసీ మీద గురిపెట్టి ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాంచేయవచ్చని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ రాజకీయంగా ఇలాంటి ఎత్తులు పదే పదే విఫలమవుతున్నా టీడీపీ తీరు మార్చుకోవడం లేదని ఈ పరిణామాలు చాటుతున్నాయి.

Also Read : కాకినాడ పోర్టు మీద టీడీపీ నేతలకు కంటగింపుగా ఎందుకు మారింది…