iDreamPost
android-app
ios-app

Chandrababu, ITDP – తెలుగు యువతను బాబు లైట్ తీసుకున్నారా…? అందుకే ఈ కొత్త విభాగం…?

Chandrababu, ITDP – తెలుగు యువతను బాబు లైట్ తీసుకున్నారా…? అందుకే ఈ కొత్త విభాగం…?

తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది కీలక నాయకులను అందించిన ఈ విభాగం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో కూడా ఆ విభాగం అధ్యక్షుడుకి కూడా అర్థం కావడం లేదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు గతంలో తెలుగు యువత చాలా కీలకంగా వ్యవహరించేది. ఆ పార్టీలో యువ నాయకులను ముందుకు నడిపిస్తూ ఉండేది. అయితే గత పదేళ్లుగా తెలుగు యువత దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది అనే మాట అక్షరాలా నిజం.

యువత ఎక్కువగా వైఎస్ జగన్ వైపు నడవడం, అలాగే తెలుగు యువతలో ఉన్న కొంతమంది నాయకులు సమర్థవంతంగా వ్యవహరించక పోవడం తో ఇప్పుడు ఆ విభాగం పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారింది. దేవినేని అవినాష్ ఆ విభాగం అధ్యక్షుడు గా వ్యవహరించినప్పుడు టిడిపి కార్యకర్తలకు నూతన ఉత్సాహం వచ్చినా ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా అధికార పార్టీలోకి వెళ్లడంతో ఆ తర్వాత తెలుగు యువత అధ్యక్షుడుగా ఎవరిని నియమించాలి ఏంటి అనేది పార్టీ అధిష్టానానికి స్పష్టత రాలేదు.

అయితే టిడిపి కార్యకర్తలకు కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆ విభాగానికి అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అయితే అప్పటి నుంచి కూడా పెద్దగా తెలుగు యువత రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం గానీ, కార్యకర్తలను పార్టీలోకి తీసుకురావడానికి కష్టపడటం గానీ పెద్దగా ఎప్పుడూ లేదు. రాజకీయంగా పార్టీ కష్టాల్లో ఉన్నా సరే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కనీసం సొంత జిల్లాలో కూడా సభలు సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు టిడిపిలో చాలామంది తెలుగు యువతకు సంబంధించిన ఆసంతృప్తిగా ఉన్నారని, ఈ విభాగం విషయంలో కొంతమంది యువ నాయకులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే చంద్రబాబునాయుడు ఒప్పుకోవడం లేదని వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

Also Read : కుప్పం సైకిల్ కి రిపేర్లు.. చంద్రబాబు కీలక నిర్ణయం..

తెలుగు యువత నుంచి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అలాగే కొడాలి నాని వంటి కీలక నాయకులు ఆ పార్టీకి దొరికినా ఆ తరహాలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ అనే నూతన విభాగం రావడంతో తెలుగు యువత గురించి పెద్దగా ఎవరూ పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ విభాగం మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కువగా దృష్టి పెట్టి పార్టీ పదవులను అప్పగించారు.

గతంలో తెలుగు యువత పదవుల కోసం ఎదురు చూసినట్టుగా ఇప్పుడు ఈ విభాగంలో పదవుల కోసం టీడీపీ కార్యకర్తలు ఎదురుచూడటం గమనార్హం. అయితే తెలుగు యువతలో ఇచ్చే పదవులకు అప్పట్లో యువ నాయకుడిని ఎంపిక చేయగా ఇప్పుడు ఈ విభాగంలో మాత్రం అన్ని వయసుల వారికి అవకాశాలు కల్పించడం ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉండే వారికి ఈ విభాగంలో టీడీపీ అధిష్టానం పదవులు ఇస్తోంది. ఈ విభాగం వచ్చిన తర్వాత తెలుగు యువత గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకునే ప్రయత్నం చేయటం లేదు.

పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి తెలుగు యువత కీలకంగా ఉన్నాసరే చంద్రబాబునాయుడు మాత్రం సోషల్ మీడియాను నమ్ముకోవడం సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉన్న వాళ్లకు పదవులు ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. ఈ విభాగం పేరుతో ఒక వీడియో తో పాపులర్ అయిన వాళ్లకు కూడా టిడిపిలో కీలక పదవులు రావడానికి కొంత మంది కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా వరకు కూడా పార్టీ అధిష్టానానికి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా సరే కార్యకర్తలకు అధిష్టానం వరకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. అయితే తెలుగు యువత బాధ్యతలను ఎవరూ సమర్థవంతంగా నిర్వహించలేరు కాబట్టి ఈ నూతన విభాగాన్ని పార్టీ అధిష్టానం తీసుకువచ్చిందని కొంతమంది కామెంట్ చేయడం గమనార్హం.

Also Read : బాబుకు తత్త్వం బోధపడిందా?