iDreamPost
android-app
ios-app

తిరుపతి ఎన్నికల్లో బీదా రవి కనిపించటం లేదే..!!

  • Published Mar 25, 2021 | 9:02 AM Updated Updated Mar 25, 2021 | 9:02 AM
  • Published Mar 25, 2021 | 9:02 AMUpdated Mar 25, 2021 | 9:02 AM
తిరుపతి ఎన్నికల్లో బీదా రవి కనిపించటం లేదే..!!

ఆర్థికంగా బలవంతులును రాజకీయంగా ప్రొత్సహించడం చంద్రబాబు శైలి రాజకీయం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆర్థిక బలం ఉన్న వారు రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మందే కనిపిస్తారు. అందులో ఒకరు శ్రీ పొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు చెంది బీదా మస్తాన్‌రావు, ఆయన సోదరుడు బీదా రవిచంద్ర యాదవ్‌లు. బీదా మస్తాన్‌ రావు 2019 ఎన్నికల తర్వాత ఆరు నెలలకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తమ్ముడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు రవిచంద్ర యాదవ్‌ కూడా సైలెంట్‌గా ఉండడం టీడీపీలో రాజకీయ హీట్‌ పెంచుతోంది.

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అంతంత  మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి.. బీదా రవిచంద్ర యాదవ్‌ తీరుతో మరింత దిగజారుతుందనే ఆందోళన తమ్ముళ్లలో కనిపిస్తోంది.గత ఏడాది జరిగిన టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో బీదా రవిచంద్ర యాదవ్‌ పేరు ఏపీ అధ్యక్షుడు రేసులో వినిపించింది. బీసీలను మళ్లీ దగ్గరకు చేర్చుకునే లక్ష్యంతో ఏపీ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడంతో కింజారపు రామ్మోహన్‌ నాయుడు, బీదా రవిచంద్ర యాదవ్‌ పేర్లు బలంగా వినిపించాయి. అయితే వీరు ఇద్దరు కాకుండా కింజారపు అచ్చెం నాయుడు పేరు తెరపైకి వచ్చింది. బీదా రవి టీడీపీ జాతీయ కార్యదర్శి పదవితో సరిపెట్టుకున్నారు.

Also Read : నామినేషన్ దాఖలు : ప‌న‌బాక‌లో మార్పు క‌నిపించేనా..?

అప్పటి నుంచి బీదా రవిచంద్ర యాదవ్‌ పెద్దగా యాక్టీవ్‌గా ఉండడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. తాజాగా తిరుపతి లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నెల్లూరు జిల్లా ఉన్నాయి. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి లోక్‌సభ పరిధిలోనివి. అందుకే టీడీపీ నేతలు చిత్తూరు జిల్లా కన్నా.. ఈ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీ నెల్లూరులోనే నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో స్థానిక నేత సోమి రెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తప్పా మరెవరూ కనిపించడం లేదు. యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెంనాయుడులు హల్‌చల్‌ చేస్తున్నా.. స్థానిక నేత, ఎమ్మెల్సీ, గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పని చేసిన బీదా రవిచంద్ర యాదవ్‌ మాత్రం కనిపించకపోవడం ఆ పార్టీ వారిని కలవరపెడుతోంది.

Also Read:సూయిజ్ కాలువలో సునామీ

2001 పరిషత్‌ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి బీసీకి రిజర్వ్‌ కావడడంతో టీడీపీ తరఫున రాజకీయారంగేట్రం చేసిన రవిచంద్ర యాదవ్‌ టీడీపీ అభ్యర్థి అయ్యారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జిల్లా పరిషత్‌ టీడీపీ ఆధిపత్యంలోనే ఎక్కువగా ఉంది. ఈ సారి కూడా బీదా రవిచంద్ర యాదవ్‌ చైర్మన్‌ కావడం తధ్యమనుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 25 జడ్పీటీసీలు, టీడీపీ 21 జడ్పీటీసీలను గెలుచుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ కాంగ్రెస్‌ అభ్యర్థులను తనవైపు తిప్పుకునేందుకు యత్నించినా.. నేదరుమల్లి జనార్థన్‌ రెడ్డి క్యాంపు రాజకీయాలు, ఆనం రామనారాయణ రెడ్డి చాణక్యంతో విఫలమయ్యాయి. చైర్మన్‌ ఎన్నిక రోజు కాంగ్రెస్‌ జడ్పీటీసీ ఒకరు టీడీపీ వైపు వెల్లడంతో కాంగ్రెస్‌కు 24, టీడీపీ బలం 22కు పెరిగింది. అయినా మూడు సీట్ల తేడాతో రవిచంద్ర జడ్పీ చైర్మన్‌ అయ్యే అవకాశం కోల్పోయారు.

బీదా బ్రదర్స్‌లో మస్తాన్‌ రావుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తోంది. ఈ నేపథ్యంలో రవిచంద్రను 2015లో చంద్రబాబు గవర్నర్‌ కోటాలో పెద్దల సభకు పంపారు. రవిచంద్ర యాదవ్‌ ఎమ్మెల్సీ పదవీ కాలం మరో మూడు నెలల్లో ముగియబోతోంది. ఈ ఏడాది జూలై 11వ తేదీన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగుస్తోంది. మళ్లీ పదవి దక్కే పరిస్థితి లేదు. అటు పార్టీ పరిస్థితి కూడా బాగోలేదు. తన అన్న మస్తాన్‌ రావు వైసీపీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రవిచంద్ర యాదవ్‌ మౌనం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom