iDreamPost
iDreamPost
కేంద్రం కన్నెర్ర చేస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం బండారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ సీపీ లోపాయికారీ పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్, విజయసాయి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ చిందులుతొక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎందుకు సైలెంట్ అయిపోయారని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేయడమే కాక, కేంద్ర ప్రభుత్వంపై కనీస మాత్రంగానైనా చంద్రబాబు ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారు? అయినదానికి, కానిదానికి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే చంద్రబాబు అండ్ కో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారు అని ప్రధాని మోదీ బహిరంగంగా విమర్శిస్తే ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలేదు? బీజేపీపై ఎదురుదాడి చేయకపోయినా.. నేను ఏ అవినీతికి పాల్పడలేదని విస్పష్టంగా చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదు? అంటే ప్రత్యేక హోదాను పణంగా పెట్టి మరీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు తన ఎంపీ రాయపాటికి కట్టబెట్టిన చంద్రబాబు అడ్డంగా దోచేసుకున్నారని అర్థం చేసుకోవాలా? బీజేపీపై నోరు జారితే జైలుకెళతామన్న భయంతోనే ఆయన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారా? అన్న ప్రశ్నలకు బండారు కాని, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు సవాల్ చేస్తున్నారు.
టీడీపీ- బీజేపీ కుమ్మక్కు కాలేదని చెప్పగలరా?
బీజేపీ, వైఎస్సార్ సీపీ లోపాయికారీ పొత్తు పెట్టుకున్నాయంటున్న బండారు ముందు టీడీపీ- బీజేపీ మధ్య కుమ్మక్కు రాజకీయం జరగలేదని చెప్పగలరా? ఏ కుమ్మక్కూ లేకపోతే స్వయంగా చంద్రబాబు అవినీతి పరుడని ఆరోపించిన ప్రధాని మోదీ ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదు? కనీసం విచారణకు సైతం ఆదేశించకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబు బీజేపీని విమర్శించకపోవడానికి ఈ కుమ్మక్కు రాజకీయం కారణం కాదా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశిస్తున్నారు. గురువింద తన నలుపు ఎరుగదన్నట్టు తమ గత చరిత్ర అవినీతి, కుంభకోణాలు అన్న సంగతి టీడీపీ నేతలు గమనించకపోతే ఎలా? బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ చంద్రబాబు అవినీతిపై చార్జిషీట్ విడుదల చేసిన సంగతి బండారుకు తెలియదా?
చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా అంటూ కమ్యూనిస్టులు ఆయనపై పుస్తకం వేసిన విషయం జనం మరిచిపోయారనుకుంటున్నారా? తనపై వచ్చిన ఆన్ని అవినీతి ఆరోపణలపై కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుని నీతులు చెబుతున్న చంద్రబాబుకు.. ఆ స్టేలు ఎత్తివేయించుకొని విచారణకు సిద్ధపడే ధైర్యం ఉందా? అని సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ – టీడీపీ కుట్ర కేసుల వల్ల 16 నెలలు జైలులో ఉండి, ఇప్పటికీ కోర్టుల్లో ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్న జగన్‌కు.. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబులా లోపాయి కారీ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సీబీఐ విచారణలో ఉన్న వివేకానందరెడ్డి హత్యకేసుపై జగన్, విజయసాయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది?అసలు ఆ విచారణకు ఆదేశించిందే తమ ప్రభుత్వం అన్న సంగతి బండారు గ్రహించాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.
Also Read : ఫ్రస్టేషన్ తో ఫలితాలు వస్తాయా?