iDreamPost
iDreamPost
ఎవరు ఎన్ని అనుకున్నా దర్శకుడు బోయపాటి శీను ఊర మాస్ ఫార్ములా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినంతగా ఇంకెవరికి కాదన్నది వాస్తవం. మొదటి సినిమా భద్ర నుంచి ఇప్పటిదాకా ఈ ధోరణిని గమనించవచ్చు. ఇటీవలే వంద కోట్ల గ్రాస్ ని అందుకుని బ్లాక్ బస్టర్ కి మించి దూసుకుపోతున్న అఖండను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ముంబై రిపోర్ట్. హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ ఇద్దరిలో ఒకరు చేసే అవకాశం ఉందని వినికిడి. వీళ్ళ కన్నా సల్మాన్ ఖాన్ అయితే మాస్ అప్పీల్ ఇంకా ఎక్కువ ఉంటుందని వర్కౌట్ చేసుకునే ఛాన్స్ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధికారికంగా ఎవరు కొన్నది ఇంకా బయటికి రాలేదు కానీ బడా ప్రొడక్షన్ చేతికే రైట్స్ వెళ్లాయని తెలిసింది. అఖండ విడుదలయ్యింది తెలుగులోనే అయినప్పటికీ నార్త్ లోనూ జనం దృష్టికి వెళ్ళింది. ముఖ్యంగా ఇందులో అఘోరా క్యారెక్టర్ ద్వారా బాలయ్యతో చెప్పించిన డైలాగులు, హిందూ గుళ్ల గురించి వివరించిన విధానం, క్లైమాక్స్ లో దుష్టసంహారం సీన్ లో శివుడి రూపాన్ని గ్రాఫిక్స్ లో చూపించడం లాంటివి బాగా కనెక్ట్ అయ్యాయి. పైరసీలో చూసినవాళ్లు కూడా అబ్బో హీరోయిజం భలే ఉందే అని ప్రశంసలు కురిపించారు. సో ఇది ఉత్తరాది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయమే. కానీ ఇక్కడో రిస్క్ ఉన్న మాట మర్చిపోకూడదు.
అఖండ పూర్తిగా బాలయ్య వన్ మ్యాన్ షో. ఆయన పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా లోపాలను కప్పిపెట్టేసి ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. కథా పరంగా క్యారెక్టరైజేషన్ల పరంగా ఉన్న తప్పులు కనిపించకుండా పోయాయి. అంతెందుకు ఇంటర్వెల్ బ్లాక్ లో బాలయ్య స్థానంలో మన హీరోల్లోనే ఎవరినైనా ఊహించుకోవడానికి ట్రై చేయండి. సంతృప్తి పరిచే సమాధానం దొరకదు. అలాంటప్పుడు అక్షయ్ అజయ్ లాంటి వాళ్ళు న్యాయం చేస్తారని అనుకోవడానికి లేదు. చాలా మార్పులు అవసరమవుతాయి. సరిగ్గా బాలన్స్ చేసుకోగలిగితే అఖండ రీమేక్ తో హిట్టు కొట్టొచ్చు. లేకపోతే ఇక్కడ జేజేలు అందుకున్న సినిమా అక్కడ నవ్వులపాలవుతుంది
Also Read : Bigg Boss 5 : నాగ్ కోసం రాబోతున్న క్రేజీ జంట ?