iDreamPost
android-app
ios-app

జగన్ మాట నిజమైన వేళ.. ఏపీలో కరోనా వ్యాప్తికి బాధ్యులు ఎవరు..?

జగన్ మాట నిజమైన వేళ.. ఏపీలో కరోనా వ్యాప్తికి బాధ్యులు ఎవరు..?

ప్రమాదం పొంచి ఉందని ఎవరు చెప్పినా దాన్ని సహేతుకంగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం.. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దాన్ని బలపరుస్తున్నాయి. తమిళనాడులో కరోనా విలయతాండవం చేయడానికి అక్కడ ఎన్నికల అధికారులు కారణమంటూ వారిపై హత్యానేరం నమోదు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా నెలన్నర ఆంధ్ర ప్రదేశ్ కిందట సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, సెకండ్ వేవ్ పొంచి ఉందని.. అప్పటివరకు ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం జగన్ మాటలు ఏ మాత్రం లెక్కచేయలేదు. పైగా ప్రతిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు మాటకు వత్తాసు పలుకుతూ కోర్టును కూడా ఆశ్రయించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుంటే రాష్ట్రంలో మాత్రం ఎందుకు అభ్యంతరం అంటూ ఎద్దేవా చేశారు. పట్టుబట్టి మరి ఎన్నికలను నిర్వహించారు.

ఎన్నికలు ముగిశాయి. నిమ్మగడ్డ ఉద్యోగ కాలం ముగిసింది. కానీ సీఎం జగన్ భయపడినట్లుగానే కరోనా కోరలు సాచింది. రాష్ట్రంలో రోజుకు 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు..? నాడు ఎన్నికలు జరపాలంటూ పట్టుబట్టి.. అధికార పార్టీ ని రెచ్చగెట్టేలా సవాళ్లు విసిరిన టిడిపి అధినేత, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్న వేళ దానికి మద్దతు పలకాల్సిన తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా వ్యవహరించింది. ప్రజలు ఎలా పోతే నాకే అన్నరీతిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టింది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ను రెచ్చగొట్టి కోర్టును ఆశ్రయించేలా చేసింది. చివరకు ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించేలా చేసింది. ఇప్పుడు తాజాగా తమిళనాడు హైకోర్టు ఆ రాష్ట్రము లో కరోనా వ్యాప్తికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా తేల్చింది. మరి ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కి బాద్యులు ఎవరు..? వద్దన్నా స్థానిక ఎన్నికలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమారా..? లేదా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కు మద్దతు తెలిపిన టిడిపి నా..?

Also Read : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు కారణం ఎవరో చెప్పిన మద్రాస్‌ హైకోర్టు