గత కొంతకాలంగా భారత్, కెనడా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల విబేధాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్లకు సంబంధాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ బలంగా తిప్పికొట్టింది. ఇతడి హత్య కారణంగానే భారత్, కెనడా మధ్య విబేధాలు వచ్చాయి. ఆ విబేధాలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఉండే బంధం తెగితే.. వాణిజ్యంపై ఎలాంటి నష్టం ఉంటుందో మార్కెట్ నిపుణలు తెలిపారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కెనడా, భారత్ దేశాలు పరస్పరం ఆరోపణలను సంధించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందుకు వేసి.. ఏకంగా భారత్‌లోని కెనడా దేశ రాయబారికి సమన్లను జారీ చేసింది. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా కెనడా సీనియర్ అధికారిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారత్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. ఖలిస్తాన్ మద్దతుదారు హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారని ఈ ఏడాది జూన్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఓ ప్రకటన చేశారు.
ఈ ఆరోపణలను భారత్ సీరియస్‌గా తీసుకుంది. కెనడ ప్రధాని ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. తాజాగా భారత్ సైతం దీటుగా స్పందిస్తూ కెనడా రాయబారిపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇదే సమయంలో కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను భారత్ నిలిపివేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 8 బిలియన్ డాలర్లు ఒప్పందం ఉంది. భారతదేశం నుండి ఎగుమతి మరియు దిగుమతులు రెండూ సమానంగా ఉంటాయి.
కాగా, ఈ విబేధాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఎగుమతులు, దిగుమతులు రెండూ భారీగా క్షీణించాయి. కొన్ని నివేదికల ప్రకారం..రెండు దేశాల మధ్య పెద్దగా వాణిజ్యం లేదు. భారత్ 4.11 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అంటే రూ.34 వేల కోట్లకు పైగా కెనడాకు ఎగుమతి చేసింది. అలానే కెనడా నుంచి భారతదేశం దిగుమతులు 4.17 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 35 వేల కోట్లు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి నాలుగు నెలల్లో అంటే 2024లో.. కెనడాకు భారతదేశం నుంచి ఎగుమతుల్లో భారీ క్షీణత ఉంది.
అధికర గణాంకాల ప్రకారం, ఈ సంఖ్య 20 శాతం కంటే ఎక్కువగా తగ్గింది. అధికారిక సమాచారం ప్రకారం, అదే సమయంలో, దిగుమతుల్లో 6.39 శాతం క్షీణత ఉంది. ఈ సంఖ్య 1.32 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 11 వేల కోట్ల రూపాయలకు తగ్గింది. మొత్తానికి భారత్, కెనడాల మధ్య తాజా ఉద్రిక్తతలు ఇరుదేశాల వాణిజ్యం, పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం లేదని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి. భారత్, కెనడా విబేధాల అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.