iDreamPost
కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో హరీష్ జైరాజ్ లాంటి టెక్నికల్ టీమ్ తో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మరీ తీశారు. ఇంతకీ ఈ శరవణన్ ఎవరనే సందేహం ప్రేక్షకుల్లో లేకపోలేదు. ఆ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. అయన అసలు పేరు అరుళ్ శరవణన్.
కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో హరీష్ జైరాజ్ లాంటి టెక్నికల్ టీమ్ తో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మరీ తీశారు. ఇంతకీ ఈ శరవణన్ ఎవరనే సందేహం ప్రేక్షకుల్లో లేకపోలేదు. ఆ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. అయన అసలు పేరు అరుళ్ శరవణన్.
iDreamPost
ఎల్లుండి ది లెజెండ్ అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఒరిజినల్ వెర్షన్ తో పాటు అదే రోజు రిలీజవుతోంది. ఇప్పటికే హీరో శరవణన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో హరీష్ జైరాజ్ లాంటి టెక్నికల్ టీమ్ తో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మరీ తీశారు. ఇంతకీ ఈ శరవణన్ ఎవరనే సందేహం ప్రేక్షకుల్లో లేకపోలేదు. ఆ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. అయన అసలు పేరు అరుళ్ శరవణన్. 1970 పుట్టిన సంవత్సరం. అంటే వయసు 52 సంవత్సరాలు. భారతదేశంలో ఒక ఫ్యామిలీ నడుపుతున్న అతి పెద్ద రిటైల్ స్టోర్ చైన్ వీళ్ళ కుటుంబానిదే. ఈ పేరు వినని వాళ్ళు తమిళనాట లేరనేది వాస్తవం.
అరుళ్ తండ్రి పేరు సెల్వరత్నం. నెల్లై జిల్లా నుంచి చెన్నైకు వచ్చి టి అమ్మకంతో మొదలుపెట్టి క్రమంగా శరవణ స్టోర్స్ తో బిజినెస్ మెన్ గా మారారు. ఈయన ఇద్దరు తమ్ముళ్లు కూడా భాగస్వాములుగా ఉండేవాళ్ళు. వయసొచ్చాక అరుళ్ శరవణన్ బాబాయ్ ల నుంచి వేరుగా వచ్చేసి ది లెజెండ్ శరవణ పేరుతో కొత్త స్టోర్స్ మొదలుపెట్టారు. తక్కువ టైంలోనే వ్యాపారం ఆకాశానికి ఎగబాకింది. మొత్తం పది వేలకు పైగా ఉద్యోగులతో ఈ సంస్థ ఏడాది టర్నోవర్ ఏడు వందల మిలియన్ డాలర్లపైనే ఉంటుందట. అరుళ్ తన బ్రాండ్ కి తనే అంబాసిడర్ గా ఉండేవారు. కోట్లలో పారితోషికాలు ఇచ్చి టాప్ హీరోయిన్లను తీసుకొచ్చి యాడ్స్ లో నటిస్తే అవి బాగా రీచ్ అయ్యాయి.
ఈ క్రమంలో ఆయనకు హీరో కావాలనే కోరిక కలిగింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు డబ్బులకు కొదవా. అంతే ది లెజెండ్ కి శ్రీకారం చుట్టేశారు. దీనికి సుమారు డెబ్భై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందట. ఒక్క రూపాయి రాకపోయినా శరవణన్ కు ఊడేదేమీ లేదు. దానికి సిద్ధపడే సినిమా తీశారు. హిట్ అయ్యిందా అదృష్టం. లేదూ అంటే వెండితెరపై తనను తాను చూసుకోవాలన్న లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది అంతే. ఇప్పటికే వచ్చిన వీడియో సాంగ్స్ మీద బోలెడు మీమ్స్ వచ్చేశాయి. యాక్టింగ్ రాకపోయినా కేవలం హంగులతో ది లెజెండ్ ని పూర్తి చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామారావు ఆన్ డ్యూటీ, విక్రాంత్ రోనాలతో పోటీకి సై అనడం ఫైనల్ ట్విస్టు