iDreamPost
iDreamPost
ఇవాళ మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందబోయే టైగర్ నాగేశ్వరరావు టైటిల్ ని రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. లుక్ రివీల్ చేయలేదు కానీ కేవలం పాదాలను హై లైట్ చేసి ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్ అనే క్యాప్షన్ పెట్టారు. వేటకు ముందు నిశ్శబ్దాన్ని గ్రహించండని దాని అర్ధం. దీని ద్వారా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. శ్రీకాంత్ విస్సా సంభాషణలు సమకూరుస్తున్నాడు. పోస్టర్ లో సైడ్ కి ట్రైన్ బ్యాక్ గ్రౌండ్ పెట్టి ఇది సుప్రసిద్ధ స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు బయోపిక్ అనే ఇండికేషన్ క్లియర్ గా ఇచ్చారు. దీనికి బెల్లకొండ హీరోకి కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్.
కొద్దిగా వెనక్కు వెళ్తే కొన్ని నెలల క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఆయన తండ్రి సురేష్ నిర్మాణంలో కెఎస్ డైరెక్షన్ లో ‘స్టూవర్టుపురం దొంగ’ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఇప్పుడు రవితేజ తీసుకున్న నాగేశ్వరరావు కథనే. దీనికి బయోపిక్ అఫ్ టైగర్ అని పెట్టారు. సో చాలా స్పష్టంగా రెండు కథలూ ఒకటే అనే క్లారిటీ వచ్చేసింది. ఏ స్వాతంత్ర సమర యోధుడి గాథ అయితే పోటీ పడటం ఓకే కానీ ఎక్కువ శాతం పెద్దగా అవగాహన లేని దొంగను తెరమీద ఇలా పోటీపడి మరీ చూపించాలి అనుకోవడం విచిత్రమే. రాబిన్ హుడ్ తరహాలో అప్పట్లో ఈ నాగేశ్వరరావు గురించి కథలుగా చెప్పుకునేవారట.
ఇప్పుడు ఎవరిది ముందు వస్తుందన్నది ఆసక్తికరం. రవితేజ, సాయి శ్రీనివాస్ ఇద్దరూ తమ తమ ప్రోజెక్టులతో బిజీ ఉన్నారు. మాస్ రాజా ప్రస్తుతం ఖిలాడీ విడుదల కోసం ఎదురు చూస్తుండగా రామారావు ఆన్ డ్యూటీ చివరి దశలో ఉంది. ధమాకా కూడా ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇవి పూర్తి కావడానికి 2022 వేసవి దాటొచ్చు ఇదయ్యాక సుధీర్ వర్మ సినిమా ఉంది. దీనికి రావణాసుర టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఈ టైగర్ నాగేశ్వరరావు సెట్స్ పైకి వెళ్తుంది. ఇక సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తప్ప వేరే ఏ ధ్యాసలోనూ లేడు. అటుఇటుగా ఇది జనవరికి పూర్తి కావొచ్చు. మరి ఈ లెక్కన ఇతనే ముందు టైగర్ గా మారతాడా అనేది సస్పెన్స్. మొత్తానికి ఇద్దరు హీరోలు ఇలా ఒకే కథతో ఒకే టైంలో చేయడం అనూహ్యమే
Also Read : Peddhanna : పండగ పూట బాక్సాఫీస్ వార్