చాగంటీ నాగశ్రీనివాస సతీష్ అలియాస్, సతీష్ చాగంటీ . టీడీపీ సోషల్ మీడియాలో అత్యంత కీలక వ్యక్తి .2014 లో బ్రింగ్ బ్యాక్ బాబు క్యాంపెన్ తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యక్తి . ఆ సమయంలో వైఎస్ జగన్ పై లక్ష కోట్లు అంటూ తీవ్ర అసత్య ఆరోపణలు చేయటంలో కానీ , బాబే రావాలి అనే క్యాంపెన్ నడపటంలో , టీడీపీ అనుకూల వర్గ , ముఖ్యంగా ఒక సామాజిక వర్గ NRI లను కూడగట్టి విదేశీ నిధులు సేకరించటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి.
బాబు అధికారంలోకి వచ్చిన పిదప అందుకు భారీగానే ప్రతిఫలం పొందాడు . ఒకటి కాదు రెండు కాదు రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన వెంకటాయపాలెం గ్రామంలో కృష్ణా ఒడ్డున సర్వే నంబర్స్ 48 , 49 , 59 62 , 63 , 64 లలో ఎకరాకు ఏడాదికి లక్ష చొప్పున నామమాత్రపు లీజుతో ఏకంగా ఎనిమిది ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకి కొట్టేసాడు.
ఈ కుంభకోణం కోసం సతీష్ చాగంటి మొత్తం 4 కంపెనీలు పెట్టాడు .అమరావతి కోస్తా ఈ-మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ , కోస్తా మెరీనా అండ్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా అగ్రి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలని పెట్టారు . ఈ నాలుగు కంపెనీలలో ఉమ్మడిగా ఉన్నది కానుమిల్లి వెంకట సూర్యప్రకాశరావు అనే అతను . సతీష్ చాగంటి డైరెక్టర్ గా ఉన్న మొదటి రెండు మెరీనా కంపెనీలకి ఈ కాంట్రాక్టు ఇచ్చారు.
విశేష ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఒకే అడ్రస్ కింద రిజిస్టర్ చేసారు . 33-21-33 , సీతారామపురం , ఏలూరు రోడ్ , విజయవాడ , కృష్ణ జిల్లా , ఏపీ . ఇదే అడ్రెస్ మీద కంపెనీలు రిజిస్టర్ చేసారు.
ఇంకో అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఇదే అడ్రస్ తో ( డోర్ నెంబర్ తో సహా ) మొత్తం 491 కంపెనీలు రిజిస్టర్ చేసారు. ఇవి మొత్తము డమ్మీ సూట్కేసు కంపెనీలు . దాదాపుగా కంపెనీలు అన్నీ ( 90 శాతం పైగా ) 2015 నుండి 2019 మార్చి మధ్యలోనే స్థాపించారు.
ఈ కంపెనీకి భూమి ఇచ్చిన నదీ ముఖ ప్రాంతంలో ఎకరా విలువ పది కోట్ల పై మాటే . ఇప్పుడు బాబు గారి లెక్కల్లో గజం లక్ష చొప్పున లెక్కిస్తే దాదాపు నాలుగు వందల కోట్ల విలువైన భూమిని అత్యంత చవకగా కోస్తా మెరీనా పేరుతో ఇతగాడు కొట్టేసిన తీరు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే . ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటో తెలుసా . “అమరావతి మెరీనా ” దీని ఉద్దేశ్యం కృష్ణాలో బోటింగ్ , రిక్రియేషన్.
టీడీపీ నేతల సహజ సిద్ధమైన విలాసాలకు బ్యాంకాక్ తరహాలో ఏర్పాటు అయిన ప్రాజెక్టు . 2018 జూన్ రెండున టెండర్ పిలవటానికి మూడు రోజుల ముందు హడావుడిగా సతీష్ చాగంటి ఏర్పాటు చేసిన ఈ డమ్మీ కంపెనీకి ప్రాజెక్టు దక్కడానికి నిబంధనలు అత్యంత సరళంగా విధించారు . ఈ కంపెనీకి ఏ విధమైన అనుభవము లేకున్నా ఫర్వాలేదు . అనుభవం ఉన్న కంపెనీతో టై అప్ అయ్యుంటే చాలు అని పిల్లోడి నెత్తిన భోగి పళ్ళు కుమ్మరించినట్టు రైతులనుండి లాక్కున్న కోట్ల విలువైన భూమిని సతీష్ ఒళ్ళో కుమ్మరించారు.
వంద కోట్ల భూమి మాత్రమే కాదు విలువైన ప్రజా వనరుల పై ఏటా వంద కోట్ల ఆదాయం అంచనాలతో రూపొందిన ఈ విలాసాల కంపెనీ రూపాయి పెట్టుబడి లేకుండా ఈ ముప్పై మూడు ఏళ్ల లీజు పరిమితిలో దోచుకొనే మొత్తం 3300 అక్షరాలా మూడు వేల మూడు వందల కోట్లు . అందులో సతీష్ చాగంటి వాటా 1700 కోట్ల పై మాటే ఇలా ఇంకెంత మందికి అడ్డికీ సేరుకి అప్పనంగా కట్టబెట్టాడో మన బాబు గారు.
అలా దొడ్డి దారిలో లోకేష్ కి , బాబుకి డబ్బులిచ్చి భూములు కొట్టేసిన వారందరూ చేస్తున్న ఒత్తిళ్ల వల్లే ఈ రోజు బాబు గారు రైతుల ముసుగులో రాజధాని పోరాటం చేస్తున్నరు తప్ప , ఆ పోరాటంలో నిజమైన రైతుల పాత్ర ఎంత అంటే నామమాత్రం అని చెప్పొచ్చు.
ఇతనే కాదు అమరావతి రాజధాని పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఒక్కో బడా బాబు వెనుక ఇలాంటి కుంభకోణాలు ఒక్కొక్కటి ఉన్నాయనటంలో సందేహం లేదు . సోషల్ మీడియాలోనే ఈ విధంగా భారీ స్థాయిలో లబ్ది పొందిన వారు మరో నలుగురైదుగురు ఉన్నారని ప్రభుత్వం వద్దనున్న ప్రాథమిక సమాచారం.
ఇలాంటి దోపిడీ దారులు ఇంకెందరు ఉన్నారో మొత్తాన్ని సమగ్రంగా విచారించి దోషులకు శిక్ష పడేట్టు చూసి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం పై ఉంది .