iDreamPost
android-app
ios-app

సామ్ శర్వాలలో ఎవరికి ఎక్కువ లాభం

  • Published Feb 06, 2020 | 12:52 PM Updated Updated Feb 06, 2020 | 12:52 PM
  • Published Feb 06, 2020 | 12:52 PMUpdated Feb 06, 2020 | 12:52 PM
సామ్ శర్వాలలో ఎవరికి ఎక్కువ లాభం

రేపు విడుదల కాబోతున్న జానుపై యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. తమిళ క్లాసిక్ మూవీ 96 రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మీద భారీ హైప్ లేదు కానీ పెట్టిన బడ్జెట్ కి జరుగుతున్న రిలీజ్ కు తగ్గట్టే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నిజానికి ప్రమోషన్ విషయంలో సామ్ ఉన్నంత యాక్టివ్ గా ఎందుకో శర్వానంద్ కనిపించడం లేదు. ఏ ఇంటర్వ్యూ చూసినా ఏ పబ్లిక్ ప్లేస్ లో ఈవెంట్ చేసినా అంతా సమంతా మాయం అయిపోతోంది.

ఒకపక్క శ్రీకారం రిలీజ్ డేట్ ప్రకటించేశారు కాబట్టి దాని షూటింగ్ లో శర్వా బిజీగా ఉన్నాడని టాక్ ఉంది కానీ మరీ ఓ వారం బ్రేక్ తీసుకోలేడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదలా ఉంచితే జాను నిజంగానే ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో హిట్ అయితే శర్వానంద్ సామ్ లలో ఎవరికి ఎక్కువ పేరు వస్తుందనే చర్చ ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది వన్ యాక్టర్ షో కాదు. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే కథ ప్రకారం కొంచెం హీరోయిన్ పాత్రకే ఎక్కువ ఎడ్జ్ తో పాటు ఎమోషన్స్ ఉంటాయి.

తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిషలు నువ్వా నేనా అనేలా పోటీపడి జీవించారు . అయినప్పటికీ త్రిషనే సోషల్ మీడియాలో ఎక్కువ హై లైట్ అయ్యింది. ఇక్కడేమో సమంతా వరస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. ఎక్కడ ఏ వేడుక చేసినా హీరోలకు ధీటుగా ఫాన్స్ నుంచి అప్లాజ్ వస్తోంది. దానికి తోడు జాను గురించి సమంతా గుచ్చి గుచ్చి ప్రత్యేకంగా చెప్పడం, తన కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ అని సెలవివ్వడం ఇవన్నీ చూస్తే రిజల్ట్ తో పాటు పేరు విషయంలో కూడా అదే జరిగేలా ఉంది. ఏది ఎలా ఉన్నా శర్వానంద్ పాత్ర కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేదే. రేపు ఈ సమయానికంతా ఫలితం వచ్చేస్తుంది కాబట్టి జాను ఎవరికి ఎంత లాభం కలిగిస్తుందో చూడాలి

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet