జోన్ 1, జోన్ 2….! ఇలా రాష్ట్రంలోని జోన్ల వివరాలు చెప్పొద్దు. ఇది రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామకాలకో లేదా సున్నిత ప్రాంతాలకు సంబంధించిన విషయమో కాదు. పూర్తిగా వ్యక్తిగతమైంది. మీ మీ వ్యహార శైలి, జీవన విధానాలే మీ జోన్ ను నిర్ణయిస్తాయి. ఇంతకీ ఏంటా జోన్లు…! అనేగా మీ సందేహం ఐతే ఇది చదవండి…!
కంఫర్ట్ జోన్, ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్, గ్రోత్ జోన్….ఎక్కడో విన్నట్టున్నాయి కదా ఈ పదాలు..!
పదోతరగతి పిల్లాడి నుంచి దేశ ప్రధాని వరకు…అందరూ ఈ జోన్లలో ఏదొక దాని కిందకు రావాల్సిందే. అయితే ఒక్కటి మాత్రం నిజం..! విజేతలెవ్వరు తొలి రెండు జోన్లలో కచ్చితంగా ఉండరు.
కంఫర్ట్ జోన్ ..
ఈ పదాన్ని తరుచూ వింటుంటాం..! నాది కంఫర్టబుల్ లైఫ్..నాది కంఫర్టబుల్ కెరీర్..! అని చెప్పేవాళ్లను చాలా మందిని చూసుంటాం. ఉన్న దానితో సంతృప్తి పడి…ఎదుగుదల లేకపోయినా పర్వాలేదు యధాస్థితి కొనసాగితే చాలు అనుకొనే వారు ఈ జోన్ కిందకు వస్తారు. ఈ జోన్లోని వారు రిస్క్ తీసుకునేందు అస్సలు ఇష్టపడరు. ఏపని చేసినా సవాలక్ష విషయాలను ఆలోచించి కానీ ముందుకెళ్లరు. దీంతో వీరి ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది.
ఫియర్ జోన్..
ప్రతి చిన్న విషయానికి భయపడి…అతిగా స్పందించే వారు ఈ జోన్ కిందకొస్తారు. ఒక విధంగా ఈ జోన్ లోని వారు బ్రతకడానికి భయపడుతుంటారు అని చెప్పొచ్చు. వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా…ఆత్మనూన్యత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు బాగా ప్రభావితం అవుతారు. తరుచూ execuses అడుగుతూ… సారీలు చెప్తూ భ్రతుకు బండిని భారంగా కొనసాగిస్తారు.
లెర్నింగ్ జోన్..
కొత్త విషయాలపై ఆసక్తి, నిరంతర పఠనం, అన్వేషణ సాగించేవారు ఈ జోన్ కిందకొస్తారు. ఇందులోని వారు సవాళ్ళను ఎదుర్కోవడానికి వెరవరు. సమస్యలేవైనా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటారు.
గ్రోత్ జోన్..
డైనమిక్ మెంటాలిటీ, వ్యవహార శైలి ఉన్నవారు ఈ జోన్ కిందకొస్తారు. ఈ జోన్ లోని వారు చేసే ప్రతి పని వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధిస్తూ ముందుకెళ్తుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఒకటి అనుకుంటే దాన్ని సాధించేవారకు విడిచిపెట్టరు. ఈ జోన్ లోని వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరతారు.
చూశారుగా నాలుగు జోన్ల గురించి…ఇంతకీ మీదే జోనో గుర్తించండి… బహుశా తొలి రెండు జోన్లలో ఉంటే చివరి జోన్లకు చేరేలా మీ ఆలోచనలు, నడవడికను మార్చుకోండి. అల్ ది బెస్ట్…!