Idream media
Idream media
టీం ఇండియా కెప్టెన్ లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య వాతావారణం ఎలా ఉంది…? కోచ్ గా ద్రావిడ్ రాకతో టీంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఏంటీ…? ఉన్నపళంగా కెప్టెన్ గా కోహ్లీ ని వైట్ బాల్ క్రికెట్ కు ఎందుకు పక్కన పెట్టారు…? ప్రపంచ కప్ గెలవకపోతే టీంలో గౌరవం కష్టమేనా…? ఇప్పుడు వినపడుతున్న ప్రధాన ప్రశ్నలు ఇవి.
టీం ఇండియా లో కెప్టెన్ గా కోహ్లీ తన మార్క్ వేసినా, ఆటగాడిగా ఎన్నో మంచి విజయాలు అందించినా ,ఐసిసి ట్రోఫీ ని అందుకోలేకపోవడంతో అతని కెరీర్ లో అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్తున్నారు పండితులు. వన్డే, టి 20 ప్రపంచకప్ లు గెలిచే జట్టు ఉన్నా సరే కోహ్లీ ఎందుకు గెలవలేకపోయాడు అనే దాని మీదనే అనేక ప్రశ్నలు. ఇక ఇప్పుడు కోహ్లీ ని పక్కన పెట్టి వైట్ బాల్ క్రికెట్ కు రోహిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేేశారు. ద్రావిడ్ వచ్చిన తర్వాత టీం లో జరిగిన అతి పెద్ద మార్పు ఇది.
అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సీరీస్ లో వన్డే లకు కోహ్లీ దూరంగా ఉంటాడు అనే కామెంట్స్ రావడం… కలిసి ఆడేందుకు సముఖంగా లేరని వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో కీర్తి ఆజాద్ మాట్లాడుతూ… కెప్టెన్ లు కోహ్లి, రోహిత్‌లు కలిసి ఆడకపోతే జట్టుతో పాటు వాళ్లు కూడా నష్టపోతారని వార్నింగ్ ఇచ్చాడు. ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడకపోవడం వల్ల తొలుత జట్టుకే నష్టం వాటిల్లినా… ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్ల కెరీర్‌లు కూడా ముగుస్తాయని స్పష్టం చేశాడు.
జట్టులో ఎవరూ శాశ్వతం కాదన్న ఆజాద్.. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి చాలా మంది దిగ్గజాలు వచ్చారు, వెళ్లారని గుర్తు చేశాడు. ఇక సఫారి టూర్ గురించి మాట్లాడుతూ… అక్కడి కఠిన మైదానాలు ప్రపంచంలోని మిగతా పిచ్‌ల కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇద్దరి అవసరం టీం కు ఉంటుందని… ఇలాంటి పర్యటన ముందు జట్టులో విభేదాలు మంచిది కాదన్నాడు. ఇలాంటి రచ్చ ద్వారా టీం ఇండియా పరువు పోతుందని… కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
Also Read : నేటి నుంచి రెండవ టెస్టు.. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి