iDreamPost
android-app
ios-app

‘మిస్ ఇండియా’ మనసులో ఏముంది

  • Published May 24, 2020 | 6:11 AM Updated Updated May 24, 2020 | 6:11 AM
‘మిస్ ఇండియా’ మనసులో ఏముంది

మహానటితో తెలుగు వాళ్ళ మనసులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ మిస్ ఇండియా నుంచి గత రెండు నెలలుగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. లాక్ డౌన్ కు ముందు ఏప్రిల్ 17 విడుదల అనే ప్రకటన, ఒక ఆడియో సింగల్ తప్ప ఇంకెలాంటి చప్పుడు యూనిట్ నుంచి రాలేదు. పరిస్థితి చూస్తేనేమో ఇంకా అలాగే ఉంది. ఆగస్ట్ తర్వాతే థియేటర్ల ఓపెనింగ్ అనే వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ మరో సినిమా పెంగ్విన్ నేరుగా ఓటిటి ద్వారా తెలుగుతో సహా సౌత్ అన్ని బాషల్లోనూ వచ్చేస్తోంది.

ఇప్పుడు మిస్ ఇండియా కూడా అదే దారిలో వెళ్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలో క్యాస్టింగ్ భారీగానే ఉంది. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా లాంటి సీనియర్లతో పాటు నవీన్ చంద్ర లాంటి కుర్ర బ్యాచు కూడా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ ఫాం లో ఉన్న తమన్ సంగీతం ఇవ్వడం కూడా అంచనాలు పెంచుతోంది. మరి కనీసం ఆడియో ట్రాక్స్ అయినా ఒక్కొక్కటిగా విడుదల చేయకుండా వీళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది అర్థం కావడం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ తో 118 రూపంలో మంచి సక్సెస్ అందుకున్న మహేష్ కోనేరు దీనికి నిర్మాత. అధిక భాగం షూటింగ్ అమెరికాలో చేశారు.

ఏడాదికి పైగానే నిర్మాణం సాగింది. ఒకవేళ ఓటిటికి మంచి ఆఫర్ వస్తే ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లు తెరుచుకున్నా క్యులో ఉన్న సినిమాల నుంచి విపరీతమైన పోటీ ఉంది. నాని వి, రెడ్, అరణ్య, నిశబ్దం, ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ ఇలా చాంతాడంత లిస్టు ఉంది. వీటి మధ్యలో మిస్ ఇండియాకు ప్లేస్ చేయడం అంత సులభం కాదు. అందులోనూ ఎంత కీర్తి సురేష్ అయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ఆశించలేం. ఇలాంటివి మౌత్ టాక్ మీద ఆధారపడి నడించేవి. మరి నిర్మాత మనసులో ఏముందో ప్రస్తుతానికి అయితే తెలియదు. ఈ వారం పది రోజుల్లో టాలీవుడ్ నుంచి డిజిటల్ రిలీజ్ కు సంబంధించి కొన్ని కీలకమైన అనౌన్స్ మెంట్స్ రావొచ్చని ఫిలిం నగర్ టాక్. మరి మిస్ ఇండియా నేరుగా థియేటర్లకే వస్తానని చెబుతుందా లేక పెంగ్విన్ దారిన పడుతుందా వేచి చూడాలి