iDreamPost
iDreamPost
ఇంకో పదమూడు రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయన్న ఆనందంలో ఉన్న మూవీ లవర్స్ కొద్దిగా వేచి చూడాల్సి వచ్చేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం జిఓ ఇచ్చినప్పటికీ నిర్ణయాలు మాత్రం ఆయా రాష్ట్రాలకు వదిలేసింది. పరిస్థితిని బట్టి డిసైడ్ చేయమని దాని సారాంశం. అయితే ఏపి, తెలంగాణలకు సంబంధించి ఇంకా ఇది చర్చల దశలోనే ఉన్నట్టు సమాచారం. రేపు తెలంగాణ థియేటర్ అసోసియేషన్ ప్రెస్ తో మాట్లాడబోతోంది. తెరిచివేతకు కావాల్సిన చర్యలకు విన్నవించడంతో పాటు నిబంధనలు మరీ కఠినంగా ఉండకుండా అభ్యర్థించబోతున్నారని తెలిసింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నుంచి విడిగా ప్రకటనలు వచ్చేదాకా వీళ్ళకు అనుమతులు వచ్చినట్టు కాదు.
అందుకే ముందస్తుగా ఒక అప్పీల్ చేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో ఇలా చేయబోతున్నట్టు తెలిసింది. నిజానికి థియేటర్లు తెరిస్తే జనం వస్తారా రారా అనేది పక్కన పెడితే అసలు ముందు ఏ సినిమాలు విడుదల చేయాలనే దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. పోనీ ఓటిటిలో వచ్చినవి ప్రదర్శిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన లేకపోలేదు. అక్కడే నెగటివ్ టాక్ వచ్చిన వాటిని డబ్బులిచ్చి మరీ ఇంకోసారి చూసేందుకు ఎవరు ముందుకు వస్తారు. అందులోనూ కరోనా భయం పూర్తిగా తొలగిపోని తరుణంలో. అందుకే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్ గా చెప్పేదాకా అమలు గురించి చెప్పలేం. మల్టీ ప్లెక్సులతో పాటు సింగల్ స్క్రీన్లు కూడా రెడీ అవుతున్నాయి. ఓ రెండు మూడు నెలల పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే 50 శాతం ఆక్యుపెన్సీలో ఎంత మేరకు సీట్లు నిండుతాయో ఊహించడం కష్టమే. పైగా స్టార్ హీరోల సినిమాలన్నీ జనవరి వైపే చూస్తున్నాయి. అందుకే టికెట్ ధరలు తగ్గించుకుని వినోదం పన్నులో ఏదైనా వెసులుబాటు దొరికితే కొంత కాలం ఆడియన్స్ ఏ మేరకు సినిమా హాళ్లకు వస్తారో విశ్లేషించేందుకు ఛాన్స్ ఉంటుంది. చేతిలో సమయం తక్కువగా ఉంది. ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు కానీ తెరిచాక కనీస స్థాయిలో ఆడియన్స్ రాకపోతే తమ పరిస్థితి ఏంటని ఎగ్జిబిటర్లు లోలోపల ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. లాక్ డౌన్ టైంలో ఇండస్ట్రీ పెద్దలు షూటింగుల కోసం మంత్రులతో చర్చలు జరిపినట్టు థియేటర్ల ఓనర్లు కూడా తమ కోసం ఏదైనా చేయాలనీ ఆశిస్తున్నారు. ఇది పరస్పర సహకారం ముడిపడిన అంశం. 15 నుంచి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటాయా లేదా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. అప్పటిదాకా జస్ట్ వెయిట్ అండ్ సి