iDreamPost
iDreamPost
భారతీయులకు అంతగా పరిచయం లేని పదం “లాక్‌డౌన్”.నిన్నటి వరకు మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న ఈ పదం నేటి నుంచి తెలుగు ప్రజలకు స్వీయ అనుభవంలోకి రాబోతోంది. సాంఘిక జీవనానికి దూరంగా ఇంట్లో మనకు మనంగా స్వీయ నిర్బంధంలో ఉండటమే “లాక్‌డౌన్”.
దేశంలో కరోనా రక్కసి సోకినా 75 జిల్లాలను లాక్‌డౌన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా కట్టడి కోసం కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మార్చి 31 వరకు ఇరు రాష్ట్రాలను లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
లాక్‌డౌన్ వల్ల నెలకొనే పరిస్థితులు:
★ హాస్పిటళ్లు,మెడికల్
షాపులు,సూపర్
మార్కెట్లు,పాలు,
కూరగాయలు వంటి
నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయి.
★ జనసమ్మర్ధం ఉండే
ప్రదేశాలైన షాపింగ్
మాల్స్,ఇతర
దుకాణాలు,సినిమా థియేటర్స్ మూసివేస్తారు.
★ నిర్ణీత సమయములో
కూరగాయలు,ఇతర
నిత్యావసర సరుకుల
కొనుగోలుకు పరిమిత
సంఖ్యలో ప్రజలను అనుమతిస్తారు.
★ అత్యవసర విభాగాలకు
చెందిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే
విధులకు హాజరు
అవుతారు.
★ ప్రయివేట్ ఉద్యోగులు ఇంట్లో నుంచి పని
చేసుకోవాల్సి ఉంటుంది.
★ బ్యాంకులు,ఏటీఎంలతో పాటు,ఇన్సూరెన్స్
కంపెనీలు,పోస్టు
ఆఫీసులు,టెలీకాం సేవలు
అందించే సంస్థలు
తమ సేవలు అందిస్తాయి
★ పెట్రోల్ బంకులు,సీఎన్‌జీ
బంకులు తెరిచి ఉంటాయి.
ఎల్పీజీ గ్యాస్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
★ లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన కూలీలకు తిండి కోసం బియ్యం, గోధుమపిండి,పప్పులు
ప్రభుత్వాలు సరఫరా
చేస్తాయి.
★ ప్రజలను ఇంటి నుండి
బయటకు రానివ్వకుండా
కట్టుబాటు చెయ్యడం.
★ ప్రజలు ఐదుగురి కంటే
ఎక్కువమంది
గుమికూడకుండా 144
సెక్షన్ అమలు చేయడం.
★ ఫంక్షన్లు,పెళ్లిళ్ల లాంటి
వేడుకలకు భారీ సంఖ్యలో
జనం హాజరు కావడం
నిషేధం.
★ ప్రభుత్వ ఆదేశాలను
పాటించని వ్యక్తులను
నిర్బంధంలోకి తీసుకోవటం.
★ ప్రజారవాణా వ్యవస్థను
పూర్తిగా స్తంభింపజేయడం.