iDreamPost
android-app
ios-app

SS Rajamouli : రాజమౌళి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

  • Published Jan 03, 2022 | 11:14 AM Updated Updated Jan 03, 2022 | 11:14 AM
SS Rajamouli : రాజమౌళి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

జరిగిందేదో జరిగిపోయింది గతం గతః అనుకోవడం తప్ప ఆర్ఆర్ఆర్ వాయిదా మీద అభిమానులకు వేరే ఆప్షన్ లేదు. గత ఇరవై రోజులుగా చేసిన భీభత్సమైన ప్రమోషన్ టీవీలో యుట్యూబ్ లో చూసుకోవడానికి తప్ప థియేటర్ కు పనికిరాలేదు. సుమారు 30 కోట్ల రూపాయలు కేవలం ఈ కార్యక్రమాలు ఈవెంట్లు చేయడానికే ఖర్చయ్యిందని ఫిలిం నగర్ టాక్. ముందు చెప్పిన జనవరి 7 విడుదలకే కట్టుబడి ఉంటే అంతకంతా వెనక్కు వచ్చేదే కానీ అనూహ్యంగా మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో నిర్మాత దానయ్యకు పోస్ట్ పోన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. రాజమౌళి ఇంత కష్టపడి పెంచేసిన హైప్ ఒక్కదెబ్బకు మంచులా కరగడం మొదలయ్యింది.

సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఇప్పటికైతే అంతా ఆపేశారు కానీ మళ్ళీ ఆర్ఆర్ఆర్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద మరోసారి తర్జనభర్జన పడక తప్పదు. ప్రతిసారి తోటి నిర్మాతల సానుభూతి దక్కదు. మీకోసం ఎన్ని సార్లు త్యాగాలు చేయాలనే కోణంలో పోటీ సినిమాలు తమ వాయిదాకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే దాకా చాలా సినిమాలు రిలీజ్ డేట్లను ముందే ఫిక్స్ చేసుకుని కూర్చున్నాయి. వాటిలో అడవి శేష్ మేజర్ లాంటి పాన్ ఇండియా మూవీతో స్టార్ట్ చేస్తే కెజిఎఫ్ 2 లాంటి గ్రాండియర్లు నితిన్ మాచర్ల నియోజకవర్గం లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి.

సో ఎక్కడ స్లాట్ ఖాళీ ఉందో వెతుక్కుని తేదీని సెట్ చేసుకోవడం ఆర్ఆర్ఆర్ టీమ్ కి అతి పెద్ద సవాల్. మళ్ళీ ఈ స్థాయి ప్రమోషన్లు సాధ్యం కాకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. దాన్ని గ్రాండ్ గా చేయడం ద్వారా జనం అటెన్షన్ ని తిప్పుకోవచ్చు. అయినా ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్ కి ఇలాంటి లెక్కలు అవసరం లేకపోయినా ఇప్పుడు కొత్త డేట్ కి మాత్రం చాలా సమీకరణాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మౌనంగా ఉండటం తప్ప ఆర్ఆర్ఆర్ టీమ్ చేయగలిగింది ఏమీ లేదు. ఏప్రిల్ లో వస్తుందా లేక వేసవిని టార్గెట్ చేసుకుంటుందా సమాధానం చెప్పాల్సింది కాలమే

Also Read : OTT Platforms : మరోసారి వరంగా మారనున్న మూడో వేవ్