iDreamPost
iDreamPost
ఈరోజుని మినహాయిస్తే ఆర్ఆర్ఆర్ విడుదలకు సరిగ్గా ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. అభిమానులు థియేటర్ల దగ్గర ఏర్పాట్లు చేయడంలో బిజీ అయ్యారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్న డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ రెండు కారణాలకు కుదుట పడ్డారు. మొదటిది ఏపిలో సీజ్ చేసిన సినిమా హాళ్లకు నెల రోజులు గడువు దొరకడం. రెండోది తెలంగాణలో కొత్త జిఓని ఆధారంగా చేసుకుని పెంచిన టికెట్ రేట్లను అమలులోకి తీసుకురావడం. దీనివల్ల మల్టీ ప్లెక్సులో గరిష్టంగా 295 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో 175 రూపాయలు రేట్లుగా ఉండబోతున్నాయి. ఇవి సామాన్యుడికి అందుబాటులో లేని వ్యవహారాలే.
వీటి సంగతలా ఉంచితే ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు పెడతారో క్లారిటీ రావడం లేదు. రాజమౌళి టీమ్ నుంచి కనీస సూచన రావడం లేదు. నిర్మాత దానయ్య కూడా ఎలాంటి క్లూ లేకుండా జాప్యం చేస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్ లోనో మరో చోటో పెడితే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టమని అందుకే రిలీజ్ తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ లాంటిది ప్లాన్ చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నారని వినిపిస్తోంది. అలా కాకపోతే ఏదో ఒక అనౌన్స్ మెంట్ రావాల్సి ఉండేది. ఎల్బి స్టేడియంలో జనవరి మొదటి వారంలో ఉండొచ్చన్నారు కానీ అక్కడ ఆ దాఖలాలు లేవు.
ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ టీమ్ టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు ఏపిలో టికెట్ రేట్ల దృష్యా బిజినెస్ మొత్తాన్ని రివైజ్ చేయమని డిస్ట్రిబ్యూటర్లు దానయ్యను అడుగుతున్నారట. ఇదెంతవరకు నిజమో ఇంకా తెలియాలి. మొదటి రోజే ఊహించని రికార్డులు ఆర్ఆర్ఆర్ సొంతమవుతాయని ఇప్పటికే టాక్ ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల బాండింగ్ జనంలోకి బాగా వెళ్లిపోయింది. పైగా ట్రైలర్ కట్ అదిరిపోవడంతో అంచనాలు మాములుగా లేవు. యుఎస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇదంతా ఓకే కానీ ఇంతకీ ఆర్ఆర్ఆర్ కథానాయకులు తెలుగు ఆడియన్స్ ని నేరుగా కలుస్తారో లేదో
Also Read : Box Office Disasters : కంటెంట్ లేని చిత్రాలకు బాక్సాఫీస్ తీర్పు