iDreamPost
android-app
ios-app

మన హైదరాబాద్‌‌లో.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం!

మన హైదరాబాద్‌‌లో.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం!

హైదరాబాద్ లోని  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఓ  అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ప్రపంచంలోని  అతి పెద్ద కార్గొ విమానమైన ఎయిర్ బెలూగా.. ఆర్జీఐఏ లో ల్యాండ్ అయింది. ప్రత్యేక తిమింగలం ఆకారంలో ఉండే ఈ ఎయిర్‌బస్ బెలూగా జూలై 31 గురువారం నాడు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ భారీ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం  ఆర్జీఐ విమానాశ్రయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

‘వేల్ ఆఫ్ ద స్కై’గా పేరొందిన ఈ  భారీ కార్గొ.. హైదరాబాద్‌లో ఆగడం ఇది రెండోసారి. ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా సరుకులు రవాణా చేయాలంటే ఏకైక మార్గం కార్గో విమానాలు. సముద్ర మార్గాలు, భూ మార్గాల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సరుకులు, మందులు చేరవేయాలంటే ఎక్కువ రోజులు పడుతుంది. అత్యవసర, విలువైన వస్తువుల్ని గంటల్లో చేరవేసేందుకు విమానమార్గ ఉపయోగ పడుతుంది. అందుకు కార్గో విమానాలను ఉపయోగిస్తారు. అలాంటి వాటిల్లో ఎయిర్ బస్ బెలూగా ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.

అలాంటి ఎయిర్ బలూగా హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీన్ని చూసేందుకు సందర్శకులు తరలివచ్చారు. నివేదికల ప్రకారం.. ఇంధనం నింపడానికి ఈ భారీ విమానం హైదరాబాద్ ఎయిపోర్టులో కాసేపు ఆగింది. గతంలో మే 2016లో, ఆంటోనోవ్ ఏఎన్ 225 అనే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం, హైదరాబాలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారిగా ల్యాండింగ్ చేయబడింది. ఇలా ఒక పెద్ద విమానం ల్యాండ్ కావడం భారత దేశంలోనే ఇదే తొలిసారి. తిమింగలం ఆకారంలో ఉన్న ఈ బెలూగా  విమానం భారీ ఎయిర్ కార్గోను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.

ఇక ఈ బెలుగా  విమానం ప్రత్యేకతలు తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం దీని సొంతం. అలానే ఈ బెలూగా కార్గో విమానం 184అడుగుల పొడవు, 56అడుగుల ఎత్తు ఉంటుంది. దీని ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు ఉంటుంది. ఈ విమానం బరువు 86 టన్నులపైనే ఉంటుంది. 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్ ఈ కార్గో విమానాన్ని తయారుచేసింది. అప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేస్తూ, సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది.

ఇదీ చదవండి:  దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. వీడియోను ట్విట్ చేసిన సజ్జనార్