Idream media
Idream media
నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నేడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపధ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉత్కంట వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా బెంగాల్ ఉప ఎన్నికలకు సంబంధించి దేశం మొత్తం కూడా ఆసక్తిగా చూస్తుంది. ఈ ఏడాది జరిగిన బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ వరుసగా మూడవ సారి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చినా నందిగ్రాం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. స్వల్ప తేడాతో ఆమె ఓడిపోయినా సిఎం గా ప్రమాణ స్వీకారం చేసారు.
ఇక రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో ఓటమి తర్వాత సిఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల్లో చట్ట సభల్లో అడుగు పెట్టాలి. ఈ నేపధ్యంలో మమతా బెనర్జీ కోసం భవానీ పూర్ నుంచి గెలిచిన తృణముల్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసి పదవిని త్యాగం చేసారు. ఇక ఈ ఎన్నికల్లో బిజెపి నుంచి న్యాయవాది ప్రియాంకా టేబ్రివాల్ బరిలోకి దిగారు. మూడు రోజుల క్రితం ఎన్నికలు జరగగా నేడు కౌంటింగ్ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు.
Also Read : జగన్ మౌనం.. విపక్షాలకు అంతుపట్టని వైనం
ఇక ఆ నియోజకవర్గం పక్కన పెట్టి మిగిలిన మూడు స్థానాల ఎన్నికలను ఒక్కసారి చూస్తే, ముర్షిదాబాద్ జిల్లాలోని రెండు స్థానాల్లో కూడా టీఎంసీ ముందంజలో ఉంది. జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో, మొదటి రౌండ్ కౌంటింగ్ తర్వాత టిఎంసి అభ్యర్థి జాకీర్ హుస్సేన్ 1,717 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మరియు సంసర్‌గంజ్‌లో, రెండవ రౌండ్ కౌంటింగ్ తర్వాత టిఎంసి ఎమ్మెల్యే అమీరుల్ ఇస్లాం 1,140 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఒడిశా ఉప ఎన్నికల్లో పిపిలి ఉప ఎన్నికల ఫలితం ఒక్కసారి చూస్తే అధికార బిజు జనతా దళ్ ఆధిక్యంలో ఉంది.
11:15 గంటలకు మూడవ రౌండ్ లెక్కింపు తర్వాత 5044 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఒడిశాలోని పూరి జిల్లాలోని పిపిలి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గట్టి భద్రత మధ్య ప్రారంభమైంది. భవానీ పూర్ విజయంపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న సంగతి విదితమే. నాల్గవ రౌండ్ కౌంటింగ్ తరువాత, మమతా బెనర్జీ 12,435 ఓట్ల తేడాతో భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా బిజెపి ఆధిక్యం కనపడలేదు.
Also Read : మమత సీఎం సీట్ సేఫ్.. భారీ మెజారిటీ