Idream media
Idream media
అదేదో సినిమాలో కుర్ర హీరో కోతి వేషాలన్నీ వేసి పక్కనున్న బ్రహ్మానందాన్ని కూడా దానిలో కలపాలని చూస్తుంటాడు.. ఇటు బ్రహ్మి ‘మీ పనులేవో మీరు చేసుకోండి.. అందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారూ’ అని పక్కకు తప్పుకుంటుంటాడు.. మాజీ ఇంటలిజెన్స్ బాస్ , ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. టీడీపీ అధికారం లో ఉన్నన్నాళ్లూ పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లోనూ విపరీతంగా జోక్యం చేసుకుంటూ తన కింది స్థాయి వారినేకాకుండా పైస్థాయిలో ఉండే డీజీపీపై కూడా జులుం చెలాయంచిన ఏబీ వెంకటేశ్వరరావు ఆ తరువాత టీడీపీ ఓడిపోవడంతో ఇరుకున పడిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ నుంచి పలు కమ్యూనికేషన్ పరికరాలను కొనుగోలు చేయగా వాటి కాంట్రాక్టు తన కుమారుడికే ఇప్పించుకుని అవినీతికి పాల్పడ్డారని ఆయన మీద అభియోగాలున్నాయి. వైఎస్ఆర్ సర్కారు వచ్చిన తరువాత ఆయన పోస్టింగ్ లేక మూలకు చేరారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీవైపు మల్లించడం వంటి అనైతిక ప్రక్రియల్లో ఏబీవీ కీలకంగా పని చేశారు. టీడిపి కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేసి ఏబీవీకి ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఈయన పరిస్థితి తారుమారైంది. పోస్టింగ్ లేదు. సస్పెష్షన్ వేటు పడింది.
ఆ తరువాత మళ్లీ పోస్టింగ్ కోసం తీవ్రంగా యత్నాలు చేసినా ఫలించలేదు సరికదా ఇప్పుడు అయన మెడమీద అరెస్టు కత్తి వేలాడుతోంది. తనను వైఎ
స్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని భీతిల్లుతున్న ఏబీవీ తన విషయంలో జోక్యం చేసుకోవాలని, తక్షణమే ఐపీఎస్ అధికారుల సంఘం పర్వసభ్య సమావేశం పెట్టి తనకు నైతిక మద్దతు ప్రకటించాలని కోరారు. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఐపీఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. ఏబీవి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న అధికారి, అయన కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నారని, ఈ తరుణంలో తాము అయనకు మద్దతుగా ఎలా నిలుస్తామని సంఘం భావిస్తోంది. ఆయన వ్యక్తిగతంగా చేసిన తప్పిదాలకు, అవినీతికి తాము ఎలా బాధ్యత పహిస్తామని, తామెలా మద్దతు ప్రకటిస్తామని సంఘం స్పష్టం చేసింది. దీంతో అటు తాను ఎంతగానో దోహదపడిన చంద్రబాబు సహకారం లేక, ఇటు సంఘం తోడ్పాటు లేక ఏక్షణంలో పోలీసులు వచ్చి ఆరెస్టు చేస్తారో తెలియక బెంగ పడుతూ రోజులు గడుపుతున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన పై స్థాయి వాళ్ళను సైతం వేధించడం, దర్పం ప్రదర్శించడం వంటివి చేసిన ఎబివి ఇప్పుడు ఎవరికీ కాకుండా ఒంటరి అయిపోయారు.