iDreamPost
android-app
ios-app

కేటీఆర్ ఉద్యమంలోకి వెళ్ళటానికి, ఢిల్లీ యూనివర్సిటీకి ఉన్న సంబంధం తెలుసా?

కేటీఆర్ ఉద్యమంలోకి వెళ్ళటానికి, ఢిల్లీ యూనివర్సిటీకి ఉన్న సంబంధం తెలుసా?

డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయ్యాను అనే డైలాగ్ మనం కామన్ గా వింటుంటాం. ఇంకేదో కాబోయి పొలిటికల్ లీడర్ అయ్యామని పొలిటికల్ లీడర్స్ అంటుంటారు. వారసత్వ ప్రభావం లేక సమాజ పరిస్థితుల ప్రభావము లేక ప్రజా ఆకాంక్షల కోసం పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతుంటారు. మన దేశంలో పాలిటిక్స్ కి బెస్ట్ ఎలిజిబిలిటీ రాజకీయ వారసత్వం.ఇదే కోవలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినా రాష్ట్ర మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం తాను అనుకోకుండా తన తండ్రికి తెలియకుండానే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యానని సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ ఓరియంటేషన్‌ కార్యక్రమంలో కేటీఆర్ తన రాజకీయ అనుభవాలు పంచుకున్నాడు.

తన తండ్రి కేసీఆర్ ఎప్పుడు తనను రాజకీయాల వైపు రావాలని కోరుకోలేదని సివిల్స్ చదివి IAS కావాలని కోరుకున్నాడని కేటీఆర్ తెలిపాడు. అందుకే. సివిల్స్ కోచింగ్ కోరకు ఢిల్లీలోని JNU పంపించడని కానీ అక్కడ “ప్రజాస్వామ్యంలో అన్నింటినీ రాజకీయలే డిసైడ్ చేస్తాయి. కానీ నువ్వు డిసైడ్ చేసుకో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండాలో” అని JNU గోడలమీద రాసినా రాతలు తనని మార్చాయని కేటీఆర్ తెలిపారు. JNU లో జాయిన్ కాకుండానే అమెరికా వెళ్లాలనని అమెరికాలో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో ఎంబీఏ చేసినా కేటీఆర్ అక్కడే ఉద్యోగం చేశానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం తెలంగాణ విషయంలో హామీని నిలబెట్టుకోకపోవడంతో విభేదించించి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు తాను కూడా అమెరికాలో జాబ్ వదిలివేసివచ్చి ఉద్యమంలో చేరరానని కేటీఆర్ తెలిపారు. అయితే తాను ఉద్యోగం వదిలి వేసిన విషయం కేసీఆర్ కు చెప్పలేదన్నారు.తాను ఎదిచేసినా కేసీఆర్ కదానడన్న నమ్మకంతోనే ఉద్యోగం వదిలివేశానని కేటీఆర్ తన అనుభవాలను పంచుకున్నాడు.

ఉద్యమ సమయంలో తనకు ఎమ్మెల్యే అంటే ఏంటి ఎమ్మెల్యే ఎం చేస్తాడని అవగాహన లేదని కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చాలా నేర్చుకున్నానని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఎన్నో అనుమానాలు,ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉండేవని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ ఉండదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలని మేధావులు సూచించారని గుర్తుచేశారు . తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎదురైన సవాళ్ళను ఎదుర్కోన్నా విధానాన్ని ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను వివరించారు.కేసీఆర్ నాయకత్వంలో ఈ ఏడు సంవత్సరాలలో చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాల అమలులో ఎదురైన సవాళ్ళను వివరించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు చేపట్టడం పెద్ద ఛాలెంజ్ అయినా తమ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని, ఏడేళ్లలో 2.23లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా.. 15లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం మంత్రి స్థాయికి ఎదిగానని మా నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు. కానీ కేసీఆర్‌ నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు మంత్రిగా పని చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. సోషల్ మీడియా విస్తృతంగా వాడకంలో ఉన్న ప్రస్తుత సమయంలో రాజకీయాలలో కొనసాగడం కత్తి మీద సామేనని కేటీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.