iDreamPost
android-app
ios-app

War-2: అంచనాలు పెంచేస్తున్న తారక్, హృతిక్.. వార్-2 కోసం సరికొత్త టెక్నాలజీ!

  • Published Mar 11, 2024 | 6:28 PM Updated Updated Mar 11, 2024 | 6:28 PM

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ వస్తున్న చిత్రం వార్-2, ఇప్పటికే ఈ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ వస్తున్న చిత్రం వార్-2, ఇప్పటికే ఈ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

  • Published Mar 11, 2024 | 6:28 PMUpdated Mar 11, 2024 | 6:28 PM
War-2: అంచనాలు పెంచేస్తున్న తారక్, హృతిక్.. వార్-2 కోసం సరికొత్త టెక్నాలజీ!

ప్రస్తుతం డే బై డే టెక్నాలజీ మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు వస్తున్న సినిమాలలో కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని సరికొత్త అద్భుతాలు సృష్టిస్తున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్-2 చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ.. యష్ రాజ్ ఫిలిమ్స్ సరికొత్త టెక్నాలిజీని ఉపయోగించనుంది. టాలీవుడ్, బాలీవుడ్ లలో బాగా పేరొందిన ఇద్దరు బడా హీరోలు నటించే చిత్రానికి.. ఇక ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంటే.. అభిమానులకు ఈ సినిమాపై ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మరి, ఈ సినిమాలో ఎటువంటి టెక్నలాజిని ఉపయోగించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది. అనే విషయాల గురించి తెలుసుకుందాం.

అయితే, వార్ 2 సినిమా అవుట్ డోర్ షూట్ లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలను.. కంప్లీట్ గా బాడీ డబుల్స్ తో తీయబోతున్నారట. సాధారణంగా అయితే ఇలాంటి సిట్యుయేషన్స్ లో డూప్ క్యారెక్టర్స్ తో పాటు.. హీరోలు కూడా సెట్స్ లోనే ఉండాలి. కానీ, వార్ 2 లో మాత్రం.. హీరోలు ఉండరు. పూర్తిగా అవుట్ షూట్స్ ను బాడీ డబుల్స్ తో తీసి.. ఆ తర్వాత విఎఫెక్స్ ని వాడి తారక్, హృతిక్ ల మొహాలను.. వాటితో స్వాప్ చేస్తారు. సో ఎక్కడా కూడా గ్రాఫిక్స్ వాడిన అనుమానం రాకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇద్దరూ స్టార్ హీరోలు ఉండే షాట్స్ అన్ని కూడా.. స్టూడియోస్ లోనే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హృతిక్ మార్చి 7నుంచి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొత్తం మీద 55నుంచి 60 కాల్స్ షీట్స్ లోనే.. హృతిక్ పోర్షన్ కంప్లీట్ చేసేలా.. అయాన్ ముఖేర్జీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక తారక్ విషయానికొస్తే.. ఈ సినిమాలో తారక్ ఏప్రిల్ నుంచి జాయిన్ అవ్వనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని కూడా ఎక్కువగా ముంబైలోనే జరుపనున్నట్లు సమాచారం. ఇక అన్ని అనుకున్న టైమ్ కి కంప్లీట్ అయితే కనుక.. వచ్చే ఏడాది ఆగస్టులో వార్ 2 చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన విషయాలైతే ఇప్పటివరకు బయటకు రాలేదు . కానీ, ఖచ్చితంగా ఇది భారీ బడ్జెట్ సినిమానే అని అందరు ఈజీగా చెప్పేస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో తారక్ కు, హృతిక్ కు మధ్య ఎటువంటి సీన్స్ ఉండబోతున్నాయా అని.. ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ముందు ముందు ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి వార్-2 మూవీ లేటెస్ట్ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş