iDreamPost
android-app
ios-app

విజయనగరం తొలి మేయర్ పీఠం వైసీపీదే !!

విజయనగరం తొలి మేయర్ పీఠం వైసీపీదే !!

అశోక్ కష్టం వృథా

ఎక్కడా కానరాని టిడిపి!!

గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సంగతి వదిలేద్దురూ… పట్టణాల్లో మేమెంటో చూపుతాం అని బీరాలు పలికిన తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడా ఘోరమైన ఫలితాలు సాధించింది. పల్లెల్లోని పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ అయినా ఇవ్వగలిగిన టిడిపి పట్టణాలు నగరాల విషయానికి వస్తే మొత్తానికి కుదేలయింది. ఎక్కడా పార్టీ ఉనికే లేకుండా పోయింది. కౌంటింగ్ ప్రారంభం అయిన రెండుగంటల్లోనే మొత్తం పరిస్థితి అర్థం అవడంతో టిడిపి అభ్యర్థులు ఒక్కొక్కరూ మెల్లగా జారుకున్నారు. ఇక విజయనగరం నగరపాలక సంస్థకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం సృష్టిరచి తొలి మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. బిసి మహిళకు రిజర్వ్ అయిన ఈ పీఠం ఎవరికి దక్కుతుందన్నది త్వరలో తేలుతుంది.

అశోక్, అదితి కష్టం వృథా!!

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓటమి పాలైన అదితి గజపతి ఈసారి పట్టణంలో తన పట్టును నిరూపించుకునేందుకు బాగానే కష్టపడ్డారు. దాదాపుగా అన్ని వార్డుల్లోనూ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేశారు. దాదాపు 20 వరకూ వార్డులు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రియల్టర్, లిక్కర్ వ్యాపారి అయిన కంది మురళి నాయుడు సతీమణి శమంతకమణి ని టిడిపి మేయర్ అభ్యర్థిగా 22 డివిజన్ నుంచి పోటీ చేశారు. కానీ ప్రత్యర్థి భవిరెడ్డి సతీష్ చేతిలో 210 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన భర్త పట్టణ అధ్యక్షుడు మురళి నాయుడు 37వ డివిజన్ నుంచి పొటీ చేసి కడియాల రామకృష్ణ చేతిలో 627 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తానికి దంపతులిద్దరూ ఓడిపోయి సరికొత్త రికార్డ్ సృష్టించారు. అశోక్ , అదితి ప్రచారం వల్ల టిడిపికి కనీసం ఒక్క డివిజన్లో కూడా విజయాన్ని సాధించిపెట్టలేదు. 17వ డివిజన్లో పోటీ చేసిన కనకల మురళీమోహన్ కూడా 911 ఓట్ల తేడాతో ఆశపు సుజాత చేతిలో ఓటమిపాలయ్యారు.

అయితే 49వ వార్డులో పోటీ చేసిన కర్రోతు రాధామణి మాత్రం కనుగుల తేజస్విని మీద గెలిచి నగరంలో టిడిపికి ఒకేఒక వేగుచుక్క లా నిలిచారు. ఎన్నడూలేనిది ఈసారి అశోక్ గజపతి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన బిడ్డ అదితి కి మంచి పునాది వేయాలని, కొన్ని డివిజన్లలో అయినా గెలవాలని ఆయన భావించి కృషి చేసిన సాధ్యం కాలేదు. మొత్తం యాభై వార్డుల్లో రాధామణి తో బాటు ఇంకో ఇద్దరు ముగ్గురు గెలిస్తే గెలవొచ్చు. లేదంటే ఈవిడ మాత్రమే పార్టీ తరఫున కార్పొరేషన్ లో వాణి వినిపిస్తుంది. మొత్తానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో వైసిపి తిరుగులేని విజయం సాధించి టిడిపిని రాజుగారి పెద్ద చెరువులో నిమజ్జనం చేసిందని ప్రజలు భావిస్తున్నారు..