iDreamPost
android-app
ios-app

స్టార్ సిటీ విశాఖ‌…

స్టార్ సిటీ విశాఖ‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చూపుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, అధికార యంత్రాంగం కృషితో విశాఖ‌ప‌ట్ట‌ణం దేశంలోనే గుర్తింపు పొందుతోంది. అన్ని విభాగాల‌లోనూ, అన్ని రంగాల‌లోనూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. సీఎం జ‌గ‌న్ విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచే ఈ న‌గ‌రంపై అంద‌రి దృష్టీ ప‌డింది. దానికి త‌గ్గ‌ట్టుగా అవార్డులు, ర్యాంకింగ్‌లోనూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతోంది. క్లైమేట్‌ స్మార్ట్‌సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ర్యాకింగ్స్‌లో మొత్తం 123 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు మాత్రమే 4 స్టార్‌ రేటింగ్‌ దక్కగా.. అందులో విశాఖ స్థానం సంపాదించుకుంది. అర్బన్‌ ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌ అండ్‌ బయోడైవర్సిటీ విభాగంతో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సత్తా చాటి ఏకంగా 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. మురుగునీటి నిర్వహణలో వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్న జీవీఎంసీ.. ఆ విభాగంలో 3 స్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకుంది.

ఎంపీ, మంత్రుల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ సంయుక్తంగా 2019–20 నుంచి స్మార్ట్‌సిటీ ర్యాంకింగ్స్‌ ప్రకటిస్తున్నారు. పట్టణ ప్రణాళిక, జీవవైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్‌బిల్డింగ్, ఎయిర్‌క్వాలిటీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై ర్యాంకింగ్స్‌ ఇస్తున్నారు. గతేడాది 9వ ర్యాంకు సాధించిన విశాఖ నగరం.. 2020–21లో మాత్రం సత్తా చాటింది. క్‌లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో మొత్తం 9 నగరాలకు 4 స్టార్‌ రేటింగ్‌ ఇవ్వగా అందులో విశాఖపట్నం కూడా నిలిచింది. ఇక వివిధ విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల్లో విశాఖ నగరం సత్తా చాటింది. అర్బన్‌ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌ అండ్‌ బయోడైవర్సిటీ విభాగంలో ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్‌ 5 స్టార్‌ రేటింగ్‌ పంచుకుంది.

వ్యర్థాల నిర్వహణ విభాగంలో 5 స్టార్, ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ విభాగంలో, మొబిలిటీ అండ్‌ ఎయిర్‌క్వాలిటీ విభాగంలో, మురుగునీటి నిర్వహణలోనూ 3 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. రెండేళ్ల కాలంలో విశాఖ నగరంలో వచ్చిన వినూత్న మార్పులతో ‘స్టార్‌ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు మంత్రులు అవంతి శ్రీ‌నివాస్, బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో విశాఖ వినూత్నంగా రూపుదిద్దుకుంటోంది.

నగరంలో రెండేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. సీడ్‌బాల్స్‌ రూపంలో లక్షకు పైగా విత్తనాలు, 58,456 మొక్కలు నాటింది. దీనికితోడు మియావాకీ చిట్టడవులు, పార్కులు ఏర్పాటు చేయడంతో.. ఈ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకుంది. దీని ద్వారా జీవవైవిధ్యానికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. 625.47 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల జీవీఎంసీ విస్తీర్ణంలో 222.53 చ.కిమీ విస్తీర్ణంలో పచ్చదనం పరచుకుంది. నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీటి వ్యర్థాల నిర్వహణలోనూ జీవీఎంసీ ప్రత్యేక చర్యలు అవలంబిస్తోంది. మురుగునీటిని శుద్ధి చేసేందుకు బయోరెమిడేషన్‌ పద్ధతుల్ని అవలంబిస్తోంది