Idream media
Idream media
విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. వాటిలో టీడీపీ కచ్చితంగా గెలిచే వార్డుల సంఖ్య 13 అని ఆ పార్టీ వర్గాలు ఇప్పటి వరకూ భావిస్తున్నాయి . చంద్రబాబుకు సైతం అదే రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. తన ప్రచారం ద్వారా ఆ సంఖ్యను మరింత పెంచుకోవాలని పార్టీ ప్రణాళికలు రచించింది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ఇప్పుడు 13 కూడా కష్టం అనే చర్చ మొదలైంది. రాజధానిగా విశాఖను కాదంటున్న టీడీపీపై వ్యతిరేకతను చంద్రబాబు ఎదుటే విశాఖవాసులు చూపడమే ఇందుకు కారణం.
విశాఖపట్టణంలో తెలుగుదేశంపై ప్రజలకు ఎంతలా వ్యతిరేకత ఉందో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు స్వయంగా తెలిసొచ్చింది. అమరావతి ఉద్యమానికి అండగా ఉంటున్న చంద్రబాబుకు విశాఖవాసులు గట్టి షాక్ ఇచ్చారు. ఆర్థిక రాజధానిగా విశాఖను ఎంతో అభివృద్ధి చేశానని, అక్కడ టీడీపీకే ప్రజల మద్దతు ఉందని చెప్పుకుని తిరిగే ఆయన ఊహించని పరిణామంతో ఒకింత అసహనానికి గురయ్యారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ఉత్తరాంధ్ర వాసులు ఎంతలా కోరుకుంటున్నారో చంద్రబాబుకు తెలిసి వచ్చి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే బహిరంగంగానే వైసీపీకి జై కొట్టారు. మరో ఎమ్మెల్యే నేడో, రేపో పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటనే ఆందోళన శ్రేణుల్లో కనిపిస్తోంది.
పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖపట్టణానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వైజాగ్‌వాసులు గొంతెత్తారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినదించారు. విశాఖపట్టణానికి రాగా అతడిని గో బ్యాక్ అంటూ ప్లేకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూడలిలో శుక్రవారం రాత్రి నిలబడి చంద్రబాబు పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత పర్యటన చేపట్టాలని ఈ సందర్భంగా నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు విశాఖపట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాకను స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. పరిపాలన రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారని నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ప్రజలు నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పజలకు క్షమాపణ చెప్పిన తరువాత పర్యటన చేయాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీతో మొన్న నారా లోకేష్, నిన్న చంద్రబాబు విశాఖలో అమీతుమీ అంటున్నారు. విజయమో వీర స్వర్గమో అని తెలుగుదేశం నేతలు పోరాడుతున్నారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. చివరకు విజయం తమదే వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా విశాఖ మేయర్ ఎన్నికల్లో ప్రాభవం చాటుకోవడానికి పైకి ప్రదర్శించే గాంభీర్యమేనని తేలిపోయింది. ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని సముదాయించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇదంతా ముందే ఊహించినట్లుగా టీడీపీ శ్రేణులే పేర్కొంటున్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితులను ముందే ఊహించిన చంద్రబాబు తొలుత కుమారుడు లోకేశ్ ను విశాఖకు ప్రచారం కోసం పంపారు. లోకేశ్ రాకను పెద్దగా పట్టించుకోని స్థానికులు నిరసనకు ఆసక్తి చూపలేదు. కానీ, చంద్రబాబు అడుగుపెట్టగానే విశాఖవాసులకు రాజధానిని దూరం చేస్తున్న వైనం గుర్తొచ్చినట్లుంది. తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.