Dharani
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఎం జగన్ ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఎం జగన్ ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
Dharani
ఆదివారం అర్థరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫైర్ యాక్సిడెంట్ మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్స్యకారులందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జనాలంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం వారికి మరపురాని కాళరాత్రిగా మారింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 50కిపైగా బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని.. రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన పని వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది. తమకు అన్నం పెట్టే బోట్లు కళ్ళ ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత బిడ్డలను కోల్పోయినట్లు కన్నీరు పెడుతున్నారు
ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఎం జగన్ ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించిన తర్వాత రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడట. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న గొడవ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 50కిపైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజు.. ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరమార్శించారు.
మరో సమాచారం ప్రకారం యూట్యూబర్ నాని తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో గొడవ జరిగిందని అంటున్నారు. పాత గొడవల వల్ల బాలాజీ అనే వ్యక్తికి, యూట్యూబర్‌కి నిన్న రాత్రి ఒకటో నెంబర్ జెట్టిలో గొడవ జరిగిందని తెలుస్తోంది. యూట్యూబర్ బోటుని అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసిన బాలాజీ.. కొంత సొమ్ము అడ్వాన్స్‌గా ఇచ్చాడని సమాచారం. అయితే కొన్ని రోజుల తర్వాత తాను ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి వెనక్కి ఇమ్మని అడుగుతున్నాడట. ఈ విషయంలోనే ఆదివారం రాత్రి గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతోనే మద్యం మత్తులో బోటు తగలుబెట్టి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.