iDreamPost
android-app
ios-app

టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి దొరకడం లేదట!

  • Published Jul 12, 2021 | 2:29 PM Updated Updated Jul 12, 2021 | 2:29 PM
టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి దొరకడం లేదట!

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి నెల రోజుల గడిచిపోతోంది. ఈటల బీజేపీలోకి చేరి హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. కానీ ఇటువైపున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలవాలని చాలా రోజుల నుంచే హుజూరాబాద్ లో ప్రచారం ముమ్మరం చేసింది. కానీ పైన కేసీఆర్, కేటీఆర్ పేర్లు తప్ప.. అభ్యర్థి ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ లీడర్ వివేక్ వెంకట స్వామి విమర్శలకు దిగారు. రెండు నెలల నుంచి టీఆర్‌ఎస్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అన్నారు.

నెల రోజులుగా వెతుకులాట

ఈటల రాజేందర్ కు ధీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ వెతుకుతోంది. అవసరమైతే పక్క పార్టీ నుంచి చేర్చుకోవాలని భావిస్తోంది. గతంలో ఇలానే పక్క పార్టీ లీడర్లను చేర్చుకుని, ఎన్నికల బరిలో నిలిపి గెలుపించుకుంది కూడా. ఈ నేపథ్యంలో పలువురి పేర్లను పరిశీలించింది. ఈటల బీజేపీలోకి రావడంతో అసంతృప్తితో ఉన్న పెద్దిరెడ్డి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకుని పోటీలో పెట్టాలని భావించినట్లు తెలిసింది. వీళ్లు కాక తమ పార్టీలోనే సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం లేదా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరిని హుజూరాబాద్ అభ్యర్థిగా బరిలో నిలపాలని యోచించింది.

ఎల్.రమణ, కౌశిక్ రెడ్డిలో ఎవరో ఒకరు..?

మొన్నటి దాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ.. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ అభ్యర్థిగా నిలబెట్టేందుకే రమణను కేసీఆర్ చేర్చుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా.. సడన్ గా ఇప్పుడే ఎల్.రమణను చేర్చుకోవడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. బలమైన బీసీ అభ్యర్థిపై.. ఇంకో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని లీడర్లు చెబుతున్నారు. దీంతో ఎల్.రమణ అభ్యర్థిత్వం దాదాపు ఖారారైనట్లేనని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో కౌశిక్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. తనకు టీఆర్ఎస్ నుంచి టికెట్ కన్ఫామ్ అయిందని ఆయన చెప్పినట్లుగా ఆడియో ఒకటి బయటికి వచ్చింది. అయితే నిజంగానే టికెట్ కన్ఫామ్ అయిందా… లేక టీఆర్ఎస్ హైకమాండ్ కు పరోక్షంగా కౌశిక్ రెడ్డి మెసేజ్ ఇస్తున్నారా? అనేది తెలియడం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే.. కాంగ్రెస్‌ నేతకు షోకాజ్‌ నోటీస్‌