iDreamPost
android-app
ios-app

కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి.. ప్రపంచ కప్ లో బెస్ట్..

  • Author Soma Sekhar Updated - 01:40 PM, Thu - 19 October 23
  • Author Soma Sekhar Updated - 01:40 PM, Thu - 19 October 23
కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి.. ప్రపంచ కప్ లో బెస్ట్..

వరల్డ్ క్రికెట్ ను ఒంటిచేత్తో శాసిస్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. బ్యాటింగ్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. దీంతో విరాట్ బ్యాట్ ముందు రికార్డులు కూడా చిన్నబోతున్నాయి. ఇక తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023లో కూడా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు కింగ్ కోహ్లీ. ఈ క్రమంలోనే మరో ఘనతను సాధించాడు విరాట్ భాయ్. ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా విరాట్ పేరును ప్రస్తావిస్తూ.. ఓ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి.. మరోసారి దటీజ్ కోహ్లీ అని నిరూపించుకున్నాడు. మరి కోహ్లీ సాధించిన మరో ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే రికార్డులు సైతం సలాం కొట్టాల్సిందే. అంతలా అతడు వరల్డ్ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన విరాట్ భాయ్.. ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023కి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు? అనే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించింది. పది మంది ఆటగాళ్లతో కూడిన లిస్ట్ ను విడుదల చేసింది ఐసీసీ. ఈ లిస్ట్ లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో చూపించిన ఫీల్డింగ్ ఆధారంగా ఈ జాబితాను రిలీజ్ చేసింది ఐసీసీ.

ఈ జాబితాలో కోహ్లీ 22.30 రేటింగ్ పాయింట్లతో టాప్ లో నిలువగా.. అతడి వెనక రెండో ప్లేస్ లో నిలిచాడు ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్. అతడికి 21.73 పాయింట్లు, మూడో స్థానంలో ఉన్న వార్నర్ కు 21.32 పాయింట్లను కేటాయించింది ఐసీసీ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే? వీరు ముగ్గురు మినహా.. ఈ జాబితాలో ఉన్న ప్లేయర్లు 16 కంటే తక్కువ రేటింగ్ పాయింట్లను సాధించడం గమనార్హం. ఈ జాబితాలో మరో ఇండియన్ ఇషాన్ కిషన్ 10వ ప్లేస్ లో నిలిచాడు. అయితే భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరొందిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ లిస్ట్ లో చోటు దక్కకపోవడం శోచనీయం. కాగా.. మరో మూడు మ్యాచ్ ల తర్వాత మరోసారి ఇంపాక్ట్ ఫీల్డింగ్ లిస్ట్ ను ఐసీసీ ప్రకటించనుంది. మరి వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేస్తూ.. శాసిస్తున్న విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.