iDreamPost
android-app
ios-app

తాగిన మత్తులో… యువకుడిని చితకబాదిన అమ్మాయిలు

తాగిన మత్తులో… యువకుడిని చితకబాదిన అమ్మాయిలు

పబ్ కు ఎవరైనా ఎందుకు వెళ్తారు?? స్నేహితులతో ఛిల్ అవ్వడానికి. అయితే ఇక్కడే చాలామంది కాస్త హద్దులు దాటి శృతిమించిపోతున్నారు. కొందరు తప్పతాగి స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు మాత్రం విచిత్రంగా పబ్ సిబ్బందితోనే గొడవ పడుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు ఒక పబ్ సిబ్బందిపై దాడి చేయడం వైరల్ గా మారింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాగిన మత్తులో ఇద్దరు యువతులు పబ్బులో యువకుడిపై దాడికి దిగారు. విపరీతంగా చితకబాదారు. అతను ఏదో చెప్పబోతున్నా, వినిపించుకునే స్థితిలో లేరు ఆ యువతులు. ఒక అమ్మాయి ఏకంగా పబ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న పూలకుండి తీసి మరీ యువకుడిపై దాడికి దిగింది.

ఇంతలో పబ్ కు సంబంధించిన బౌన్సర్ కలగజేసుకుని ముగ్గురినీ విడదీశాడు. ఆ యువతులు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.

ఘటనను పరిశీలించిన పోలీసులు సదరు యువతులను గుర్తించినట్లుగా సమాచారం. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అమ్మాయిల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి మాత్రం ఫిర్యాదు చేసేందుకు రాలేదని అంటున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş